Indrakeeladri Saraswati Alankaram
Devi Navaratrulu 2025: నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిలో ఎనిమిదో రోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. జ్ఞాన సంపద కోసం సరస్వతీ దేవిని భక్తులు కొలుస్తారు.
సరస్వతీదేవి అలంకార విశిష్టత, పూజా విధానం
త్రిశక్తి స్వరూపిణి దుర్గాదేవి తనలోని నిజరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే ఈ రూపం విశిష్టత
అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పించాలి
నైవేద్యంగా దధ్యోదనం ఇవ్వాలి
చింతామణి, కిణి, అంతరిక్ష, జ్ఞాన, నీల, ఘట, మహా సరస్వతులుగా సప్త నామాలతో పూజించాలి
ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని అమ్మవారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బొమ్మల కొలువులు పెట్టి, పేరంటాలు చేస్తారు
పుస్తకాలను అమ్మవారి చెంత ఉంచి విద్యార్థులు పూజిస్తారు
అక్షరాభ్యాసానికి బాసర, వర్గల్, శ్రీ కనక దుర్గమ్మ ఆలయాలకు వెళ్లవచ్చు
ఋగ్వేదం, దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, పద్మపురాణంలో సరస్వతీ దేవి గురించి ప్రస్థావన
బ్రహ్మ సరస్వతిని సృష్టించాడు
సృష్టి కార్యంలో బ్రహ్మకు తోడుగా ఉండేందుకు పుట్టిన సరస్వతీదేవి
పరాశక్తి ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు (Devi Navaratrulu 2025)
సరస్వతి శ్లోకం
సరస్వతి నమ: స్తుభ్యం వరదే కామరూపిణి
విద్యరంభం కరిశ్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణని
నిత్యం పద్మాలయాం దేవీ సామం పాతు సరస్వతి
Note: ఈ వివరాలు పాఠకులకు అవగాహన కోసం మాత్రమే రాశాం. వీటిని శాస్త్రాల్లో, పలువురు నిపుణులు తెలిపిన విషయాల ఆధారంగా ఇస్తున్నాము.