×
Ad

Karthika Masam: కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే.. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు తిరుగులేదంతే..!

వాటిపై ఐదు చోట్ల గంధం బొట్లు, ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి.

Karthika Masam: కార్తీక మాసంలో విద్యా రంగంలో అద్భుతంగా రాణించడానికి, పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి, అర్హతకు తగిన ఉద్యోగం లభించడానికి, వ్యాపారంలో పోటీ తట్టుకుని విపరీతంగా రాణించేందుకు శ్రీచందన దీపాన్ని వెలిగించాలి. అసలు శ్రీచందన దీపం అంటే ఏమిటి? విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు అందుకోవడానికి శ్రీచందన దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం.

వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి కార్తీక మాసంలో శ్రీచందన దీపం విశేషంగా సహకరిస్తుంది. శ్రీచందన దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చు. లేదా కార్తీక మాసంలో వచ్చే బుధవారాల్లో శ్రీచందన దీపం వెలిగిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. శ్రీచందన దీపాన్ని వెలిగించాలి అని అనుకునే వాళ్లు ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే దానికి గంధం, కుంకుమ బొట్లు అలంకరించి, ఆ ఫోటో దగ్గర ఒక రాగి పల్లెం లేదా ఇత్తడి పల్లెం ఉంచాలి.

వాటిపై ఐదు చోట్ల గంధం బొట్లు, ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. శ్రీచందన దీపం వెలిగించాలి అనుకునే వారు తులసి చెట్టు వేరు నుంచి లేదా తులసి చెట్టు కాండం నుంచి వచ్చినటువంటి చందనాన్ని కొద్దిగా తీసుకుని ఆ చందనాన్ని బియ్యపు పిండిలో కలిపి దీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ దీపాన్ని శ్రీచందన దీపం అని పిలుస్తారు. పిండి దీపానికి, శ్రీచందన దీపానికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే.. పిండి దీపం అంటే బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి దీపం తయారు చేస్తారు. దీన్ని పిండి దీపం అంటారు.

ఇలా బుధవారం చేస్తే చాలా మంచిది..

శ్రీచందన దీపం అంటే బియ్యం పిండితో పాటు కొద్దిగా చందనం కూడా కలిపి బియ్యం పిండిలో ఆవు పాలు, బెల్లం తురుము కలిపి దీపం తయారు చేస్తే దాన్ని శ్రీచందన దీపం అంటారు. ఇలా తయారు చేసుకున్న పిండి దీపాన్ని మీరు ఏర్పాటు చేసుకున్న రాగి పల్లెం లేదా ఇత్తడి పల్లెంలో ఉంచి ఆవు నెయ్యి పోసి కుంభవొత్తి అంటే పువ్వొత్తి వేసి దీపం వెలిగించాలి. కనీసం రెండు పువ్వొత్తులు వేసి దీపం వెలిగించాలి. అలా వెలిగించిన దీపం చుట్టూ పుష్పాలతో అలంకరణ చేయాలి. ఇది కార్తీక మాసంలో వచ్చే బుధవారం చేస్తే చాలా మంచిది.

ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకుని ఓం వషట్కారాయ నమ: అనే విష్ణు మంత్రాన్ని వీలైనన్ని సార్లు (108 లేదా 54 లేదా 21 సార్లు) చదువుకోవాలి. ఇలా చేయడం ద్వారా విష్ణువు కృపకు పాత్రులు కావొచ్చు. ఇలా కార్తీక మాసంలో ఏ రోజైనా లేదా బుధవారం కానీ శ్రీచందన దీపం వెలిగించాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. విష్ణువు కృప వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోండి.

Also Read: కాల అమృతయోగము అంటే ఏంటి? మీకు ఉందా? రోగం వస్తే డాక్టర్లూ ఏమీ చేయలేరు.. మరి ఎలా?