Lunar Eclipse 2025 Remedies: సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీన్ని రాహుగ్రస్త చంద్ర గ్రహణం అని కూడా అంటారు. రాత్రి 9గంటల 58 నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 8న తెల్లవారుజామున ఒంటి గంట 26 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి 3 గంటల 29 నిమిషాలు. కుంభ రాశిలో పూర్వాభాద్రపద నక్షత్రంలో చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈ ఖగోళ దృశ్యం భారత్ లోనూ స్పష్టంగా కనిపించనుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాల ప్రభావం రాశులపై కచ్చితంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా కొన్ని రాశుల మీద గ్రహణం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని, వారికి తీవ్రమైన కష్టాలు ఎదురు కావొచ్చని అంటున్నారు. మరి గ్రహణ కాలంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
గ్రహణ ప్రభావంతో ఈ రాశి వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులకు భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉండదు. ఇంట్లో అశాంతి కలిగించే వాతావరణం ఏర్పడుతుంది. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పరిహారం : వినాయకుడిని స్మరణ చేసుకోవాలి. గం గణపతయే నమ: అనే మంత్రం జపం చేసుకోవాలి.
చేయాల్సిన దానం : బెలం, శనగలు.
సింహ రాశి..
గ్రహణం కారణంగా ఈ రాశి వారికి అశుభ ఫలితాలొస్తాయి. ఆర్థిక పరంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆందోళన, అశాంతి, ఆగ్రహం, విసుగు ఎదుర్కోవచ్చు.
పరిహారం : మహా విష్ణువుని స్మరణ చేసుకోవాలి. నమో నారాయణాయ అనే మంత్రం జపం చేసుకోవాలి.
చేయాల్సిన దానం : గోధుమలు.
తులా రాశి..
ప్రతికూల ఫలితాలొస్తాయి. వైవాహిక జీవితంలో అనేక సమస్యలు ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. శత్రువులు మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు.
పరిహారం : కృష్ణుడిని స్మరణ చేసుకోవాలి. శ్రీ కృష్ణాయ నమ: అనే జపం చేసుకోవాలి.
చేయాల్సిన దానం : మంగళ ద్రవ్యాలు
కన్య రాశి…
కన్య రాశి వారు నిరాశకు గురవ్వదు. ఆధ్యాత్మిక, వ్యక్తిగత అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడవచ్చు. నెగిటివ్ వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. గ్రహణం తర్వాత చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ధైర్యంగా ఎదుర్కోవాలి.
కుంభ రాశి..
కుంభ రాశి వారు చంద్ర గ్రహణం తర్వాత తమ భాగస్వామి ప్రవర్తనతో విసిగిపోయి వారికి దూరం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనాలి.
పరిహారం : పరమేశ్వరుని స్మరణ చేసుకోవాలి. నమ:శివాయ అనే మంత్ర జపం చేయాలి.
చేయాల్సిన దానం : శెనగలు, నువ్వులు, దక్షిణ.
మీన రాశి…
మీన రాశి వ్యక్తులు ఈ చంద్రగ్రహణం ఫలితంగా భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. మీ ఆందోళన పెరుగుతుంది. అనుకోని సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
పరిహారం : పరమేశ్వరుడిని, దత్తాత్రేయుడిని స్మరణ చేసుకోవాలి. శ్రీ గురుదేవ దత్తా అని జపం చేసుకోవాలి.
చేయాల్సిన దానం : బెల్లం లేదా చక్కెర, పాలు, పసుపు.
మేష రాశి: ఈ రాశి వారికి ఈ గ్రహణం వృత్తిపరమైన జీవితంలో సవాళ్లను తీసుకురావొచ్చు. కెరీర్‌లో వచ్చే అవకాశాలను చేజార్చుకోకుండా ఉండాలంటే.. అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.
పరిహారం : నమ:శివాయ అని జపం చేయాలి.
చేయాల్సిన దానం : ఎర్రటి వస్త్రాలు, మిరపకాయలు, దక్షిణ.
వృషభ రాశి: వీరికి నిందలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీని వల్ల మనస్తాపం చెందవచ్చు. కోపం, అహంకారం ఈ సమయంలో మీకు హాని చేయవచ్చు.
పరిహారం : లక్ష్మీదేవి స్మరణ చేసుకోవాలి. శ్రీ మహా లక్ష్మి నమ: అనే నామాన్ని జపించుకోవాలి.
చేయాల్సిన దానం : పాలు, వెన్న, తెల్లటి వస్త్రాలు దానం చేయాలి.
Also Read: సంపూర్ణ చంద్ర గ్రహణం.. తప్పకుండా చేయాల్సిన పనులు ఏంటి? అస్సలు చేయకూడని తప్పులు ఏంటి?