×
Ad

దరిద్రదేవత మీ జోలికి రావద్దన్నా.. లక్ష్మీ కటాక్షంతో మీకు డబ్బులు రావాలన్నా ఇలా చేయాలి..

లక్ష్మీ కటాక్షం ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా అన్నం తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

Indian Food (Image Credit To Original Source)

  • భోజనం చేసిన కంచంలో చేతులు కడగకూడదు
  • ఒడిలో కంచాన్ని పెట్టుకుని భోజనం చేయవద్దు
  • తింటున్న సమయంలో ఎంగిలి చేతితో అన్నం పెట్టుకోరాదు

Hindu Beliefs: దరిద్రదేవత మీ జోలికి రావద్దన్నా.. లక్ష్మీ కటాక్షం ఉండాలన్నా కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా అన్నం తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

దరిద్రదేవత స్థానాలు ప్రత్యేకించి కొన్ని ఉన్నాయి. భోజనం చేసిన కంచంలో చేతులు కడగకూడదు. ఒడిలో కంచాన్ని పెట్టుకుని భోజనం చేయకూడదు. భోజనం చేసిన కంచంలో చేతులు కడగకూడదు.

తింటున్న సమయంలో ఎంగిలి చేతితో అన్నం పెట్టుకోకూడదు. ఇళ్లంతా చేతికి ఉన్న ఎంగిలిని చల్లకూడదు. కంచెంలో పెట్టుకు తిన్న తర్వాత ఆ చోటుని నీటితో శుద్ధి చేయాలి. లేదంటే దరిద్ర దేవత చుట్టుముట్టేస్తుంది.

దరిద్ర దేవత వద్దని అనుకునేవారు లక్ష్మీ దేవత కటాక్షమే కావాలని అనుకునేవారు కొన్ని నియమాలు పాటించాలి. ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. భోజనం చేసేటప్పుడు కంచం చుట్టూ మెతుకులు పడకుండా చూసుకోవాలి.

తిన్న కంచం ఎవరైనా చూస్తే కడిగిన కంచమా? అనుకోవాలి. అలా మొత్తం తినాలి. అన్నం అరచేతిని దాటి వెళ్లకూడదు. అంటే మరెక్కడా అంటకూడదు. భోజనం చేశాక వేళ్లు నాకకూడదు. నడుస్తూ తినకూడదు.

నియమబద్ధంతా భోజనం చేస్తే తిండి విషయంలో లోటు ఉండదు. దేవతలు ఇవి అన్నీ గమనిస్తుంటారు. పంక్తిలో కూర్చున్నప్పుడు అందరూ మొదలు పెట్టేదాక మీరు కూడా తినకూడదు. అందరూ తిని లేచే వరకు మీరూ లేవకూడదు. నియమాలకు విరుద్ధంగా చేస్తే మీకు ఉన్న సంపద అంతా పోతుంది.

NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.