Astro Remedies
Astro Remedies : ఈ నెల (ఫిబ్రవరి) చివరి వారంలో మీన రాశిలో ఒక ప్రత్యేకమైన గ్రహ కూటమి జరగబోతోంది. ఈ నెలాఖరులో ఒకేసారి 3 గ్రహాలు కలిసి మీన రాశిలో త్రిగ్రహి యుతిని ఏర్పచనున్నాయి. పంచాంగం ప్రకారం.. ఫిబ్రవరి 27, 2025న, బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు, శుక్రుడు ఇప్పటికే బృహస్పతి రాశి మీనరాశిలో ఉన్నారు.
Read Also : Car Loan : కారు లోన్ తీసుకుంటున్నారా? ఈ సింపుల్ ఫార్ములాను పాటిస్తే చాలు.. భవిష్యత్తులో ఈఎంఐ కష్టాలే ఉండవు!
ఇలాంటి పరిస్థితిలో, మూడు గ్రహాల కలయిక ఏర్పడనుంది. దీన్నే త్రిగ్రహి యోగం అని కూడా అంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ యోగా ప్రభావం కొన్ని రాశిచక్రాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ త్రిగ్రహి యోగం ఈ రాశుల వారికి అనేక ఆరోగ్య, ఆర్థిక సమస్యలను సృష్టించగలదు. ఈ సమయంలో 3 రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి :
మీన రాశిలో ఏర్పడిన త్రిగ్రహి యోగం.. మేష రాశి వారికి చెడు ప్రభావాన్ని కలిగించనుంది. ఈ సమయంలో మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ పని విషయంలో అనేక సమస్యలు తలెత్తవచ్చు. ప్రతి పనిని జాగ్రత్తగా చేయండి.
వ్యాపారం చేసే వారు కూడా ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయవలసి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. ఇంట్లో లేదా కుటుంబంలో ఎవరితోనైనా వాదించకండి. లేకుంటే సంబంధాలు చెడిపోవచ్చు. గ్రహాల దుష్ప్రభావాల నివారణకు శివుడిని పూజించండి. ఈ పరిహారం ద్వారా త్రిగ్రహి యోగం దోష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
సింహ రాశి :
సింహ రాశి వారికి ఈ సమయం కలిసిరాదు.. మానసిక సంక్షోభాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీకు ఏకాగ్రత లోపించి మానసిక ఒత్తిడికి గురవుతారు. మీరు ఉద్యోగంలో లేదా చదువులో ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. తల్లిదండ్రులతో వాదనలు కలగవచ్చు. కాస్తా ఓపిక పట్టండి.
ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కచ్చితంగా పెద్దవారి సలహాలు సూచనలను తీసుకోండి. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. గ్రహాల దుష్ప్రభావాలను తొలగించేందుకు ఉదయం సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి. ఈ పరిహారంతో గ్రహ దోష ప్రభావాన్ని నివారించుకోవచ్చు.
తుల రాశి :
తుల రాశి వారికి ఈ సమయం కొంచెం కష్టంగా ఉంటుంది. మీ పనిలో శత్రువులు అడ్డంకులు సృష్టించవచ్చు. మీకు దగ్గరగా ఉన్నవారు కూడా మీకు ద్రోహం చేయవచ్చు. ఎవరినీ అవసరానికి మించి నమ్మవద్దు. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు మరింత కష్టపడాల్సి రావచ్చు. అపార్థాలు కలగవచ్చు. గ్రహాల దుష్ప్రభావాలు తొలగిపోవాలంటే శివున్ని ఆరాధించండి. శివలింగానికి అభిషేకం చేయాలి. ఈ పరిహారంతో ఈ గ్రహ దోషాలను తొలగించుకోవచ్చు.