Cancer
Karkataka Rashi Ugadi Rasi Phalalu 2025 : కొత్త ఆశలతో అడుగుపెట్టిన ఉగాది.. కొన్ని రాశుల వారిని ఆర్థికంగా అనుగ్రహిస్తే, మరికొన్ని రాశుల వారి యశస్సు పెంచనుంది. త్రిగ్రహ, చాతుర్ గ్రహ, పంచగ్రహ కూటములు అన్ని రాశుల వారినీ ఎంతో కొంత చికాకు పెడతాయి. ముఖ్యంగా మేష రాశికి ఏల్నాటి శని ప్రారంభం అవుతున్నది. సింహరాశికి అష్టమ శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని చికాకులు తెప్పిస్తుంది.
అయితే, ఈ మూడు రాశులకూ రాహు, కేతువులు అండగా నిలవనున్నారు. మేషరాశికి లాభ రాహువు, ధనుస్సు రాశికి సప్తమ గురువు, సింహరాశికి లాభ గురువు ఉండటం వల్ల.. శని వల్ల కలిగే ఆటంకాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టవు. ఈ మూడు రాశుల వారూ నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. శక్తి మేరకు అనాథలకు దాన ధర్మాలు చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం: 8 వ్యయం: 2
రాజపూజ్యం: 7 అవమానం: 3
చైత్రం: ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితు-లను కలుసుకుంటారు.
వైశాఖం: ఆరోగ్యంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. శుభకార్యాలకు హాజరవుతారు.
జ్యేష్ఠం: ఈ నెలలో గ్రహస్థితి మిశ్రమం. అన్ని విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచన. బంధువర్గంతో కలహ సూచన.
ఆషాఢం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కు-కుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటారు.
శ్రావణం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు, గృహ నిర్మాణ పనులు చేపడ-తారు. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంటుంది.
భాద్రపదం: ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రద్ధ కనబరుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసర చర్చల మూలంగా ఇబ్బం-దులు ఏర్పడతాయి. ఆస్తి తగాదాలు ముదురుతాయి.
ఆశ్వయుజం: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు ఏకాగ్రతతో పూర్తిచేస్తారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చుల నియంత్రణ అవసరం.
కార్తికం: విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అయితే, ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి.
మార్గశిరం: ఉత్సాహంతో పనులు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది.
పుష్యం: ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా కొన-సాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సంయమనంతో నిర్ణయాలు తీసుకోవడం అవసరం.
మాఘం: పాత బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు. సరైన సమయంలో నిర్ణ-యాలు తీసుకుంటారు.
ఫాల్గుణం: అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. భూ లావాదేవీల్లో ఇబ్బం-దులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దల సలహాలు పాటించండి.