Aquarius
Kumbha Rashi Ugadi Rasi Phalalu 2025 : కొత్త ఆశలతో అడుగుపెట్టిన ఉగాది.. కొన్ని రాశుల వారిని ఆర్థికంగా అనుగ్రహిస్తే, మరికొన్ని రాశుల వారి యశస్సు పెంచనుంది. త్రిగ్రహ, చాతుర్ గ్రహ, పంచగ్రహ కూటములు అన్ని రాశుల వారినీ ఎంతో కొంత చికాకు పెడతాయి. ముఖ్యంగా మేష రాశికి ఏల్నాటి శని ప్రారంభం అవుతున్నది. సింహరాశికి అష్టమ శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని చికాకులు తెప్పిస్తుంది.
అయితే, ఈ మూడు రాశులకూ రాహు, కేతువులు అండగా నిలవనున్నారు. మేషరాశికి లాభ రాహువు, ధనుస్సు రాశికి సప్తమ గురువు, సింహరాశికి లాభ గురువు ఉండటం వల్ల.. శని వల్ల కలిగే ఆటంకాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టవు. ఈ మూడు రాశుల వారూ నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. శక్తి మేరకు అనాథలకు దాన ధర్మాలు చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.
కుంభం
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం: 8 వ్యయం: 14
రాజపూజ్యం: 7 అవమానం: 5
చైత్రం: ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపారం లాభసాటిగా కొన-సాగినా, సిబ్బందితో ఇబ్బంది ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి.
వైశాఖం: రావలసిన డబ్బు అందుతుంది. తలపెట్టిన పనులు ఇట్టే పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. వాహనం విషయంలో ఖర్చులు ఉంటాయి.
జ్యేష్ఠం: ప్రారంభించిన పనులు ఆటంకాలతో పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమిం-చవలసిన సమయం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగు-లకు స్థానచలన సూచన. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు
తలెత్తుతాయి.
ఆషాఢం: రావలసిన డబ్బు అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వివా-హాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
శ్రావణం: అందరి సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పనులలో శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల వల్ల అలసటకు గురవుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి.
భాద్రపదం: ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. అధికారుల మన్ననలు అందుకుంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ఆశ్వయుజం: తలపెట్టిన పనులు కలిసివస్తాయి. స్నేహితులు, బంధువులతో వైష-మ్యాలు తొలగిపోతాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం.
కార్తికం: ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంక్రిమెంట్, బోనస్ అందుకుంటారు. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు నెరవేరుతాయి. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు.
మార్గశిరం: ఇంటాబయటా సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో సంతృప్తి లభిస్తుంది. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
పుష్యం: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభ-సాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు వస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
మాఘం: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఫాల్గుణం: రావలసిన డబ్బు రావడంలో జాప్యం కలుగుతుంది. కొత్త పనుల్లో ఆలస్యం ఉంటుంది. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు.