×
Ad

Vaikuntha Chaturdashi: వైకుంఠ చతుర్దశి.. ఈ చిన్న పని చేస్తే చాలు.. భయంకరమైన అప్పులన్నీ తీరిపోతాయి..!

దీంతో నవగ్రహాల అనుగ్రహం ఏక కాలంలో కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో గోదానం చేస్తే అద్భుతం. గోవుల్లో కపిల గోవుకి చాలా శక్తి ఉంటుంది.

Vaikuntha Chaturdashi: తీవ్రమైన అప్పులతో బాధ పడుతున్నారా? ఈ రుణబాధల నుంచి విముక్తి పొందేందుకు, ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి, ఏక కాలంలో శివకేశవుల అనుగ్రహం పొంది అష్ట దరిద్రాలు తొలగింపజేసుకోవటానికి ఏం చేయాలో తెలుసుకుందాం..

కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు. దీని ప్రాధాన్యత ఏంటంటే.. వైకుంఠంలో ఉన్న శ్రీ మహా విష్ణువు భూలోకానికి దిగి వచ్చి భూలోకంలో కాశీ క్షేత్రానికి వెళ్లి కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకుంటాడు. ఆ తర్వాత మళ్లీ వైకుంఠం వెళ్తాడు. అందుకే దీన్ని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు. చాలా శక్తిమంతమైన రోజు నవంబర్ 4 మంగళవారం వచ్చింది.

ఆరోజున అందరూ శివాలయం లేదా విష్ణువు ఆలయం ప్రాంగణంలో ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి. రాగి లేదా కంచు పాత్ర ఏదైనా సరే.. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె.. ఏదైనా పోయచ్చు. ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే, రాగి పాత్ర కంచు పాత్ర అందుబాటులో లేని వారు మామూలుగా మట్టి ప్రమిదలో అయినా సరే ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి శివాలయం లేదా విష్ణువు ఆలయంలో దక్షిణతో పాటు ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శివకేశవుల ఇద్దరి అనుగ్రహం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.

ప్రధానంగా నవగ్రహ దోషాలు ఏకకాలంలో పోవాలంటే, నవగ్రహాలు అనుగ్రహించాలంటే నవంబర్ 4న కందులు, పెసలు, శెనగలు (ఒక్కొక్కటి కేజింపావు) దేవాలయ ప్రాంగణంలో పూజలు చేసే అర్చకులకు దానం ఇవ్వాలి. దీంతో నవగ్రహాల అనుగ్రహం ఏక కాలంలో కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో గోదానం చేస్తే అద్భుతం. గోవుల్లో కపిల గోవుకి చాలా శక్తి ఉంటుంది. కపిల గోవు చాలా మహిమాన్వితమైందని చెబుతారు.

అలాంటి కపిల గోవులు వెయ్యి ఒకేసారి దానం ఇచ్చిన ఫలితం కలగాలంటే.. వైకుంఠ చతుర్దశి రోజున..శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేసి, దధ్యోజనం (పెరుగన్నం) నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దేవాలయంలో శివలింగానికి ఆవు పెరుగు ఇచ్చి అభిషేకం చేయించుకోవచ్చు. లేదా ఇంట్లో శివ లింగం ఉంటే దానికైనా ఆవు పెరుగుతో అభిషేకం చేసుకోవచ్చు. ఆలయం లేదా ఇంట్లో దధ్యోజనం నైవేద్యంగా సమర్పించొచ్చు. ఈ చిన్న పని చేస్తేనే వెయ్యి కపిల గోవులను మీ చేత్తో దానం ఇచ్చిన అద్భుత ఫలితం కలుగుతుంది.

భయంకరమైన అప్పుల సమస్యలతో బాధపడే వారు ఎవరైనా సరే.. అప్పుల సమస్యల నుంచి బయటపడేందుకు.. వైకుంఠ చతుర్దశి సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో లేదా ఆలయంలో శివుడికి ప్రత్యేకంగా తర్పణం వదలాలి. ఆ ప్రత్యేకమైన తర్పణం వదిలితే కోట్లలో అప్పులున్నా సరే తొందరలో ఏదో విధంగా డబ్బు కలిసొచ్చి ఆ అప్పు నుంచి బయటపడొచ్చు.

తర్పణం ఇలా వదలాలి..

ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్లలో మందార పూలు, గన్నేరు పూలు కొన్ని ఉంచి, ఆ నీళ్లు ఇంట్లో శివుడి ఫోటో దగ్గర లేదా శివలింగం దగ్గర తర్పణం లాగా వదలాలి. అలా వదిలిన నీళ్లు ఒక పళ్లెంలో పడేలా వదలాలి. తర్వాత ఆ నీటిని తీసుకెళ్లి మొక్కలకు పోయాలి. ఇది ఇంట్లో అయినా చేసుకోవచ్చు, ఆలయంలోనైనా చేసుకోవచ్చు. దేవాలయంలో శివుడికి ఎదురుగా ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకోవడం, అందులో మందార పూలు, గన్నేరు పూలు ఉంచడం, వీలైతే ఒక పారిజాత పుష్పం ఆ నీళ్లలో వేయడం, శివుడికి ఎదురుగా కింద పళ్లెం పెట్టి అందులో పడేలా తర్పణం వదలాలి. ఆ తర్వాత ఆ నీళ్లను ఆలయ ప్రాంగణలోని మొక్కలకు పోయాలి. ఆలయంలో చేస్తే ఫలితం ఇంకా తొందరగా వస్తుంది. నవంబర్ 4.. సూర్యాస్తమయం సమయంలో దీన్ని చేయాలి.