Remedies: కోపం, మొండితనం పూర్తిగా తగ్గిపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. చాలా మంది పిల్లలకు, పెద్దలకు కోపం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. చాలామందికి మొండితనం ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఏం చెప్పినా వినరు. వాళ్లు అనుకున్నదే చేస్తుంటారు. ఈ కోపం, మొండితనం వల్ల మనం జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. కోపాన్ని, మొండితనాన్ని పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే పరిహార శాస్త్రంలో చెప్పిన శక్తిమంతమైన పరిహారాలు చేసుకోవాలి..
* కొబ్బరికాయ పరిహారం – ఆదివారం రోజున ఉదయం కొబ్బరి కాయ తీసుకుని దేవాలయానికి వెళ్లాలి. నవగ్రహాల ఉన్న చోటుకు వెళ్లాలి. నవగ్రహాలకు నమస్కారం చేసుకుని కొబ్బరి కాయను చేతిలో పెట్టుకుని 9సార్లు నవగ్రహాల చుట్టూ తిరగాలి. ఆ తర్వాత కొబ్బరికాయను ఒకే దెబ్బకు పగలగొట్టాలి. ఇలా చేయడం వల్ల క్రమక్రమంగా కోపం తగ్గుతుంది. కొబ్బరికాయ పగలగొట్టాక కాళ్లు చేతులు కడుక్కుని శివాలయంలోకి వెళ్లి శివుడిని దర్శించుకోవాలి. శివాలయంలో ఉన్న నవగ్రహాల దగ్గర ఆదివారం ఈ కొబ్బరి కాయ పరిహారం చేయాలి. ఇలా 12 ఆదివారాలు చేయాలి. అది పూర్తయ్యాక కోపం, మొండితనం క్రమక్రమంగా తగ్గుతాయి.
* మంగళవారం, శుక్రవారం ఈ రెండు రోజులు రావి చెట్టు దగ్గరికి వెళ్లాలి. రావి చెట్టు దగ్గర నీళ్లు పోసి 5 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టాలి. రావి చెట్టు కింద నాగదేవతల విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాల కింద ఉమ్మెత్తు పూలు లేదా చామంతి పూలు ఏవో ఒకటి పెట్టాలి. ఇలా 9 మంగళవారాలు లేదా 9 శుక్రవారాలు చేస్తే క్రమక్రమంగా కోపం, మొండితనం తగ్గిపోతాయి.
* మంగళవారం, శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో భక్తులకు దద్దోజనం పంచి పెట్టాలి. ఇలా 9 మంగళవారాలు, 9 శుక్రవారాలు చేస్తే కోపం, మొండితనం తగ్గిపోతాయి.
* నెలకు ఒకసారి అమావాస్య రోజున లేదా మంగళవారం లేదా ఆదివారం ఎండు మిరపకాయలు, ఉప్పు కలిపి దిష్టి తీయాలి. క్లాక్ వైజ్ మూడుసార్లు యాంటి క్లాక్ వైజ్ మూడుస్లార్లు.
* సుబ్రహ్మణ్య స్వామి ఫోటోని హాల్ లో పెట్టుకుని నమస్కారం చేసుకోవాలి. కుజుడు కోపానికి, మొండితనానికి కారకుడు. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఆయన ఫోటోని హాల్ లో పెట్టుకుని రోజూ నమస్కారం చేసుకుంటే క్రమక్రమంగా కోపం మొండితనం తగ్గుతాయి.
* దేవాలయ ప్రాంగణలో భక్తులకు మంచి నీళ్లు, ప్రసాదం పంచిపెట్టాలి. ఇలా చేయడం క్రమక్రమంగా కోపం, మొండితనం నుంచి బయటపడొచ్చు.