Ugadi 2025: పంచాంగాన్ని ఎందుకు వినాలి? విశ్వావసు నామ సంవత్సరం అనే పేరు ఎలా వచ్చింది?

"అగ్ని స్వరూప ఆదిత్యుడే ఈ సంవత్సరానికి దేవుడు" అని బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి అన్నారు.

ఉగాది 2025 విశిష్టత ఏంటి? విశ్వావసు నామ సంవత్సరం అనే పేరు ఎలా వచ్చింది? వంటి విషయాలను 10టీవీకి తెలియజేశారు శృంగేరీ శారదా పీఠం ఆస్థాన పండితుడు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి.

“ప్రభవాది 60 ఏళ్లలో 39వ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. 354 రోజులు ఈ ఉగాది ఉండబోతుంది. ఉగాది అంటే యుగమునకు ఆది. చైత్ర మాసంలో ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించాడు.

వసంత రుతువు, చైత్ర మాసం, ఉత్తరాయణం శుక్ల పక్షం పాడ్యమి తిథి అశ్విని నక్షత్రం కానీ, రేవతీ నక్షత్రం కానీ మొదలైతే దాన్ని ఉగాది అంటారు. ఈ ఏడాది రేవతీ నక్షత్రంతో ఉగాది ప్రారంభం అవుతుంది.

Also Read: చూస్తే దిమ్మతిరిగిపోయేంత పసిడి.. భారత్‌లోని ఈ రాష్ట్రంలో బంగారం నిక్షేపాలు గుర్తింపు

ఈ సారి ఆదివారం పండుగ వచ్చింది. కాలం ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటోంది. కొన్ని విచిత్రమైన పరిస్థితులు, కొన్ని అద్భుతాలు, మంచి-చెడుల కలయిక ఈ విశ్వావసు నామ సంవత్సరం. ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇవి తెలుసుకుంటే ఈ ఏడాది బాగుంటుంది.

పంచాగం ఎందుకు వినాలంటే ఈ రోజున తిథి, వార, నక్షత్ర యోగాలతో కూడిన పంచాగాన్ని వింటే భవిష్యత్తులో మనకు తలెత్తే అస్థవ్యస్థ పరిస్థితులను ఎదుర్కోవచ్చు. విశ్వావసు పేరులోనే దీనికి విశ్వం అండపిండ బ్రహ్మాండమును తన దివ్య అద్భుత తేజోమయ కిరణాలతో ప్రకాశింపజేసే సూర్యుడి అనుగ్రహమే విశ్వావసు. అగ్ని స్వరూప ఆదిత్యుడే ఈ సంవత్సరానికి దేవుడు” అని బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి అన్నారు.