×
Ad

ఈ వారం రాశిఫలాలు (నవంబర్ 16 నుంచి 22 వరకు).. వీరి వద్దకు అకస్మికంగా డబ్బులు వచ్చిపడతాయ్.. ఇక వ్యాపారంలోనైతే..

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన 12 రాశాల ఫలితాలు..

Horoscope

ఈ వారం ఫలితాలు (నవంబర్ 16 నుంచి 22 వరకు)

గురువు కర్కాటకంలో వక్రస్థితి
శని మీన రాశిలో వక్రగతి
రాహుకేతువులు కుంభ సింహ రాశులలో
రవి బుధ కుజులు వృశ్చిక రాశిలో సంచారం
శుక్రుడు తులా రాశిలో
చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశులలో సంచారం

మేషం: శ్రమకు తగిన గుర్తింపు, కొత్త వారితో పరిచయములు కలుగుతాయి, నూతన కార్యక్రమములు సఫలీకృతమవుతాయి, విద్యార్థులకు మంచి ఫలితములు, ఉద్యోగులకు పని ఒత్తిడి కలగడం, ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు లాభములు, చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి, మునసిక ప్రశాంతత కలుగుతుంది, వివాదములు, శ్రీ అంగారక స్తోత్రపారాయణము చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

వృషభం: గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అకస్మిక ధనలాభము, బంధువుల నుంచి శుభసమాచారము, రాజకీయ నాయకులకు అనుకులంగా ఉంటుంది, ఆస్తివివాదములు తీరుతాయి. భూములు, వాహనములు కొనుగోలు చేయడం, భాగస్వాములతో వివాదములు పరిష్కారము కావడం. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు శుభ ఫలితములు కలుగుతాయి. నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల ఉత్తమ ఫలితములు వస్తాయి.

మిధునం: కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు కలసివస్తాయి. స్థిరాస్తి అగ్రిమెంటు, ఇంటి నిర్మాణ ప్రయత్నములు కలసివస్తాయి. సమస్యలు తీరుతాయి, వ్యాపారములు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యమైన పనులు నిర్వహించి గుర్తింపు పొందుతారు, రావలసిన సొమ్ము అందుతుంది. పారిశ్రామిక వేత్తలకు, రాజకీయ నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుంది. సోదరులతో వివాదములు తగ్గుతాయి. రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

కర్కాటకం: వ్యాపారంలో ఆటంకములు, బాధ్యతలు భారం అవుతాయి. విద్యార్థులకు ప్రతికూల ఫలితములు. వ్యాపార కార్యకలాపాల్లో అంతరాయములు. ఉద్యోగులకు పనిభారము పెరగడం. వివాదములు పెరగడం, పనులు వాయిదా వేయవలసి వస్తుంది. ప్రయాణములలో లాభమలు, రుణబాధలు. శ్రీ కనకధారాస్తోత్ర పారాయణము చేయడం వల్ల శుభం కలుగుతుంది.

సింహం: కుటుంబ వివాదములు పరిష్కారము అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు, వ్యాపారములలో లాభములు, కళా కారులు, క్రీడాకారులకు లాభములు. కుటుంబ వివాదములు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేయడం. ఇష్ట దైవ ఆరాధ్య వల్ల శుభం కలగుతుంది.

కన్యా: ప్రయాణములలో లాభములు, అనుకోని విధంగా అన్నీ కలసివస్తాయి. పనులు పూర్తి అవుతాయి, ఆదాయం పెరగడం, వృత్తి ఉద్యోగములలో లాభములు, ఆర్థికపరమైన ఇబ్బందులు తీరుతాయి, అకస్మిక ధనలాభములు, వాహన సుఖము, సరైన నిర్ణయములు తీసుకోవడం, మంచి ఆలోచనలు అన్నదమ్ముల మధ్య అనుబంధము పెరగడం, కోర్టు సమస్యలు పరిష్కారమకావడం. గణపతి ఆరాధన వలన శుభం జరుగుతుంది.

తులా : ఈ రోజు శుభ ఫలితములు కలుగుతాయి. ప్రయాణమువలన లాభములు కలుగుతాయి, వృత్తి పరంగా ఆశించిన ప్రయోజనములు పొందుతారు. ఖర్చులు పెరగడం, కీలక వ్యవహారములలో నిర్ణయములు తీసుకోవడంలో స్పష్టత లోపిస్తుంది. గిట్టని మాటలు పట్టించుకోవద్దు, ప్రయాణముల వలన లాభములు కలుగుతాయి. విద్యార్థులకు అనుకూలము. శ్రీ దత్తాత్రేయ పారాయణము చేయడం వల్ల శుభం కలుగుతుంది.

వృశ్చికము : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణములు చేయడం, ఆర్థిక పరంగా లాభములు కలగడం, వ్యాపారములలో లాభములు, ఉద్యోగంలో అనుకూల ఫలితములు కలగడం, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము, ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరి కొంతకాలం ఎదురుచూడాలి, కుటుంబంలో ఆనందము కలగడం, విలువైన ఆభరణములు, కొనుగోలు చేస్తారు. శివారాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

ధనస్సు: మిశ్రమ ఫలితములు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారములలో ఊహించని సమస్యలు, ఆర్థిక నష్టాల విషయంలో జాగ్రత్త అవసరము. మరోవైపు కుటుంబంలో ఆనందకర సంఘటనలు జరుగుతాయి. శుభకార్యములు జరుగుతాయి. ఆరోగ్య పరంగా చిన్నచిన్న ఇబ్బందులు, మిత్రులు, బంధువులతో సహనంగా ఉండాలి. విద్యార్థులకు అనుకూలము. అమ్మవారి ఆలయ సందర్శన చేయడం వల్ల శుభం కలుగుతుంది.

మకరం : ఈ రోజు శుభకరంగా ఉంటుంది, బాల్య మిత్రులని కలుసుకుని సరదాగా గడుపుతారు, ఆరోగ్యం కుదుటపడుతుంది, ఆస్తి వ్యవహారములలో కలసివచ్చే అవకాశము, స్థిరమైన బుద్ధితో ప్రశాంతమైన మనసుతో పనిచేసి మీ ఖ్యాతి తగ్గకుండా చూసుకోండి, ఆర్థిక లాభములు, అకస్మిక ధనలాభం కలుగుతాయి. ఇష్ట దేవత ఆరాధన వలన ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

కుంభ: వృత్తి ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలు మినహా శుభంగా ఉంటుంది, ఈ రోజు మానసిక ఆందోళనలు, అధికారుల ఒత్తిడి కలగడం, భాగస్వామ్య వ్యాపారంలో సమస్యలు, ధనలాభం, కోర్టు సమస్యల్లో పరిష్కరములు కనబడటం, తీర్థయాత్రలు, ప్రయాణముల వలన లాభములు, అన్నింటా విజయ సూచనలు, శుభకార్యక్రమములలో పాల్గొనడం సంతోషం శాంతి కలుగుతుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన ఉత్తమము.

మీన: ఈ రోజు విశేషంగా యోగిస్తుంది, వ్యాపారము-ఉద్యోగములలో ఆర్ధిక లాభములు, అన్ని రంగాల వారికి ఈ రోజు లక్ష్మీ కటాక్షంతో ఆర్ధికలాభములు, పనిలో విజయ పరంపరలుగా ఉంటాయి, ఆరోగ్యం సహకరిస్తుంది, ఈ రోజంతా ప్రశాంతంగా గడిచి పోతుంది, ఆకస్మిక ధనలాభము కలుగుతుంది, సహనంతో ఉంటే అన్ని శుభములు జరుగుతాయి. శ్రీ కనకధార స్తోత్రము పారాయణము చేయటం వల్ల శుభం కలుగుతుంది.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ

Ph: 9849280956, 9515900956