ఈ వారం రాశిఫలాలు (డిసెంబర్ 28 నుంచి జనవరి 3 వరకు)
గురువు మిధున రాశిలో వక్రస్థితి
శని మీన రాశిలో వక్రగతి
రాహుకేతువులు కుంబ సింహ రాశులలో
రవి కుజ శుక్రులు ధనస్సు రాశిలో
బుధగ్రహం 29 వరకు వృశ్చికంలో డిసెంబర్ 30 నుంచి ధనస్సు రాశిలో
చంద్రుడు మీన మేష వృషభ మిధున రాశులలో సంచారం
చాతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడింది
మేష రాశి: కుటుంబ జీవితములో సుఖము, శరీర ఆరోగ్యము, ధనలాభము, కీర్తి, సంతోషము, స్త్రీ సౌఖ్యము, పరోపకార్యములు చేయడం. (శివారాధన చేయాలి)
వృషభ రాశి: శారీరక రుగ్మతలు, అనారోగ్యము మానసిక వేదన, మనో విచారము, ప్రయత్న కార్యములు చెడిపోవుట, సోమరితనం భయము, మనస్తాపము. (అమ్మవారి ఆరాధన చేయాలి)
మిధున రాశి: మంచి ఉద్యోగము లభించడం, నూతన వ్యాపారములు, ప్రయూణములు, బంధు మిత్ర విరోధము, హృదయ ఆందోళన, స్థాన చలనము, నీచ స్త్రీ మూలకముగా కలహములు. (సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి)
కర్కాటక రాశి: ధనలాభము, నూతనవస్త్ర లాభము, మనో ధైర్యము, ఇష్టస్త్రీ సంగమం, అన్నదమ్ములతో అనుకూలము, కుటుంబంలోను, చేయు వృత్తులయందు సుఖశాంతులు పొందుతారు. (గణపతి ఆరాధన వలన ఉత్తమ ఫలితము కలుగుతాయి)
సింహ రాశి: ధన విషయంలో చికాకులు, నమ్మినవారి వలన మోసము, మనోవిచారము, రోగ బాధలు, స్త్రీ మూలకంగా, తల్లిమూలకంగా ఇబ్బందులు. (శివా ఆరాధనతో శుభఫలితములు కలుగుతాయి)
కన్యా రాశి: శరీర సౌఖ్యము, వ్యాపారంలో లాభములు, ఆరోగ్యము, సంతోషము, ఉత్సాహము, సన్మానము, మృష్టాన్న భోజనము
వృద్ధి, ఉద్యోగలాభం. (వేంకటేశ్వర స్వామి ఆరాధన వలన శుభము జరుగుతుంది)
తులా రాశి: బంధు, పుత్ర, మిత్రులతో మాట మాట పట్టింపులు, సోమరితనం, ప్రయూణములో అలసట, అగౌరము, శరీరశ్రమ, బదిలీలు, ధనవ్యయం, మనస్సు ఇబ్బందికరమైన సంఘటనలు కలుగును. (విష్ణువు ఆరాధన మంచిది)
వృశ్చిక రాశి: నిరోద్యోగులకు ఉద్యోగలాభం, సుఖ భోజనము, ధనలాభము, కుటుంబ సౌఖ్యములు, బంధు మిత్రులతో విందు వినోదములు, శుభవార్తలు, ప్రభుత్వ సహాయం. (గణపతి ఆరాధన)
ధనస్సు రాశి: ప్రయత్నకార్యములందు జయము, ఆరోగ్యము, ఇష్టకార్యసిద్ధి, విలువైన ఆభరణముల కొనుగోలు, బంధు మిత్రులతో గౌరవం పొందడం. (రాజ రాజేశ్వరి అమ్మవారి ఆరాధన మంచిది)
మకర రాశి : కుటుంబ కలహములు, భయము, అనారోగ్యము, ఉద్యోగ వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరము, అనారోగ్యము, ఆటంకములు. (ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి)
కుంభ రాశి: అజీర్ణ బాధలు, సంతానముతో విరోధము, ధనలాభము, వ్యాపారంలో లాభము, ప్రయాణముల వలన ధనము రావడం, భయము, స్థానచలనము. (నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి)
మీన రాశి: గౌరవము, స్త్రీ సుఖము, శరీర సౌఖ్యము, ధనలాభం, కుటుంబములో భార్యబిడ్డల మూలకంగా సుఖశాంతులు కలుగును, అన్ని పనులు విజయవంతం కావడం, వ్యాపారం లాభములు. (వేంకటేశ్వర స్వామి వారి ఆరాధన మంచిది)
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956