Rahu kaal: రాహు కాలము అంటే రాహువు ఏ సమయంలో ఉంటుందో ఆకాలము అని నిర్వచించుతారు. ఈ రాహుపాత కాలమును తమిళదేశస్థులు పాటిస్తారు. ఈ రాహుకాలము సూర్య మానస్తులైన దక్షిణాది వాసులకు మాత్రమే. రాహుకాలము తమిళరాజ్యంలో ఉద్భవించినది. ఈ రాహుకాలమును చాంద్రమానస్తులు కూడా పాటిస్తున్నారు. కానీ, ఇది సరియైన నిర్ణయము కాదు.
చాంద్రమానస్తులు రాహుకాలము పాటించాలని ఏ ప్రామాణిక గ్రంథములలో కూడా లేదు. ధర్మసింధు నిర్ణయసింధు, నారదసంహిత, భృగు సంహిత గర్గసంహిత, వశిష్ట సంహిత, కాలమృతము ముహూర్త చింతామణి, ముహూర్త మార్తాండము మొదలగు గ్రంథాలలో కూడా లేదు. ఇది ముఖ్యంగా భారతదేశంలో ఉద్భవించినదే. ప్రతిరోజు గంటన్నర (1-30) ప్రమాణము ఉంటుంది. రాహుకాలములో రెండు కర పద్ధతులు ఉంటాయి. వాటిలో మొదటి దాని గురించి తెలుసుకుందాం..
సూర్యాస్తమయము వరకు ఉండే సుమారు 12 గంటలు ప్రమాణమును ఎనిమిది (8) భాగాలు చేస్తే ఒక్కొక్క భాగానికి కొన్ని నిమిషాలు పడుతుంది. ఏరోజున రాహుకాలము గురించి తెలుసుకోవాలంటే ఆరోజు వారమును బట్టి రాహుకాలమును నిర్ణయము చేస్తారు. వారము భాగము నిర్ణయించిన ధ్రువాంశతో పెంచి సూర్యోదయంతో కలిపితే రాహు కాలప్రారంభ సమయము వస్తుంది. వారముల ధ్రువాంశము గురించి తెలుసుకొందాము.
1) ఆదివారము -ధ్రువాంశము-7
2) సోమవారము – ధ్రువాంశము-1
3) మంగళవారము-ధ్రువాంశము-6
4) బుధవారము – ధ్రువాంశము-4
5) గురువారము – ధ్రువాంశము-5
6) శుక్రవారము – ధ్రువాంశము- 3
7) శనివారము – ధ్రువాంశము- 2