×
Ad

సర్పయోగములు ఇవే.. సంతాన, వివాహ, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార సమస్యలు చుట్టుముడతాయ్‌.. 

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..

జాతక చక్రములో పంచమ స్థానాన్ని అనుసరించి సర్పయోగమును నిర్ణయించాలి. సంతాన సమస్యలు, వివాహ, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార మొదలగు సమస్యలు వస్తాయి. ఈ పంచమ భావ దోషకారకాలను సర్పయోగములుగా జ్యోతిషశాస్త్రం అభివర్ణిస్తుంది.

1) జాతకచక్రంలో పంచమమైన సంతానస్థానంలో రాహువు ఉండి, ఆ రాహువుతో కుజుడు కలిసినను (లేక) దృష్టి కలిగితే సర్పదోషము ఏర్పడును.
2) మేషరాశి, వృశ్చిక రాశులలో రాహువు ఉంటే సర్పదోషము అవుతుంది.
3) పంచమస్థానములో శని ఉన్నచో, శనిగ్రహము చంద్రునితో కలిసినా సర్పదోషము ఏర్పడును.
4) పంచమస్థానాధిపతి రాహువుతో కలిసినా సర్పదోషము అవుతుంది.
5) పంచమాధిపతి దుర్భలుడైనా సర్పదోషము అవుతుంది.
6) పంచమాధిపతి దుష్టస్థానంలో నీచ, శతృరాశిలో ఉండి జన్మలగ్నంలో రాహువు ఉంటే సర్పదోషము అవుతుంది.
7) పంచమస్థానంలో రవి, కుజ, బుధ, గురు, శని, రాహువులుండి, పంచమ, లగ్నాధిపతులు బలహీనులైనా సర్పదోషము ఏర్పడును.
8) జన్మలగ్నాధిపతితో కుజుడు కలిసిననూ సర్పదోషము ఏర్పడును.
9) కుజాంశలో కుజుడున్నా సర్పదోషము ఏర్పడును.
10) కుజుడు, రాహువు కలసినా సర్పదోషము ఏర్పడును.
11) గురువు, కుజుడుతో కలసినా నాగదోషము ఏర్పడును.
12) గురువు, రాహువుతో కలిసినా సర్పయోగము అవుతుంది.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Ph: 9849280956, 9515900956