×
Ad

కాలసర్పదోష జాతకులు ఏ దేవుడిని పూజించాలి? మీకు ఎదురవుతున్న అన్ని అడ్డంకులు పోవాలంటే ఇలా చేస్తే సరీ..

కాలసర్పయోగమునకు దుర్గా గణపతుల ప్రాశస్త్యము గురించి ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..

Kaal sarp yog: కాలసర్పదోష జాతకులు శ్రీ మహా గణపతిని పూజించాలి. దానికి కారణం వినాయకుడు కాలస్వరూపుడు. రాహువుకు అధిష్టానదేవత దుర్గాదేవి కేతువుకు అధిష్టానదేవత గణపతి అనగా అమ్మవారి రూపం ఏదైనా రాహుకేతువుల దేవతలు సామాన్య భాషలో లక్ష్మీగణపతి, అనగా తల్లి కొడుకులు.

అదే రాహుకేతువులు దేవతల అనుబంధము. మన సంవత్సర మొదట్లో వచ్చే భాద్రపద మాసంలో గణపతినవరాత్రులు, “నవానాం రాత్రీనాం సమాహారః నవరాత్రమ్.” అని శ్లోకం ద్వారా గణపతి నవరాత్రకాలంలో వినాయకుడు మనలని అనుగ్రహించి తరువాత తల్లితగ్గరికి పంపిస్తాడు. అవే శరన్నవరాత్రములు అని గ్రహిస్తాము. గణపతి అంబికల అనుగ్రహానికి పాత్రులయ్యాక ఆ ఇద్దరు దేవతలు దేవుడి దగ్గరికి పంపిస్తారు అదే మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి.

శ్లోకం॥

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే॥

పై శ్లోకము గణపతిని ప్రార్థిస్తూ చదివే శ్లోకం ఇది మనము శ్లోకమునకు అర్థం తెలుసుకుందాం.

ఈ శ్లోకములో విష్ణువు పేరు శుక్లాం బరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించువాడు, శశివర్ణం అంటే చంద్రుడిలా తెల్లగా ఉండటం. చతుర్భుజమ్ అనగా నాలుగు చేతులు కలవాడు ప్రసన్నమైన ముఖంతో ఉండేవాడు అయిన శ్రీహరిని సర్వ విఘ్నాలూ తొలగాలని ప్రార్థిస్తున్నాను అని అర్థము. మరి వినాయకుని ముందు శ్రీహరిని ప్రార్థించడం ఏమిటి? దీనిలో అంతరార్థము ఏమిటి?

ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించువాడు శ్రీహరికాదు. వినాయకుడు కాదు, శ్రీహరి పీతాంబరుడు. (పచ్చని పట్టువస్త్రాలు ధరించేవాడు) వినాయకుడు ఎర్రని వస్త్రములు ధరిస్తాడు. అలాగే చంద్రునిలా తెల్లగా ఉండేవాడని శ్లోకంలో ఉన్నది. కాని శ్రీహరి నీలమేఘశ్యాముడు, వినాయకుడు శరీరచ్ఛాయ ఎరుపు మరి ఈ శ్లోకము విష్ణువుది కాక గణపతిది కాక ఎవరిది?

ఇక్కడ అసలు అర్ధము ఏమిటంటే శుక్లాంబరధరమ్ అనగా తెల్లని వస్త్రాలని ధరించినవాడనేది అర్థంకాదు ఏ పృధివ్యాపోతేజోవాయు అనే నాలుగు ఏ ఆకాశం నుండి వచ్చాయో అలాంటి ఆకాశాన్ని ధరించిన వాడని దీని భూతాలమీద అదుపు కలవాడు అన్నమాట అని అర్థము.

అంటే శశివర్ణము అనగా శశి అంటే కుందేలు. దాన్ని తనలో కలవాడు చంద్రుడు. ఆ చంద్రుని లక్షణం. పదిహేనురోజులు పెరుగుదల, పదిహేనురోజులు తరుగుదల మరియు చతుర్భుజమ్ అంటే నాలుగుచేతులు అని అర్థం కాదు రోజులు, పక్షము (15రోజులు) నెలలు, సంవత్సరాలు ఈ నాల్గింటిని ప్రసన్నవదనమ్ అనగా ఏనుగులన్నిటికీ శ్రేష్ఠమైన ఏనుగు ముఖం కలవాడైన, సర్వవిఘ్నోప శాంతయే అంటే అన్ని అడ్డంకులు తొలగించేవాడు అని అర్థము. వి

ఘ్నములు తొలగించుపని విష్ణువుది కాదు. వినాయకుడిది అనగా పై శ్లోకమునకు అర్థము ఏమిటంటే చేతులను కాలస్వరూపంలాగ, ఏనుగు ముఖం కలిగి ఉండటం. విఘ్నములు తొలగించడం, పంచభూతముల మీద అదుపు కలిగి ఉండటం. శ్లోకంలో విష్ణువు పేరు ఉండటం. అనగా పై విషయములలో శ్రీహరికి, వినాయ కుని ఏమైన సంబంధము ఉన్నదేమో అని అనుమానము వస్తుంది.

వాస్తవంగా ఇక్కడ శ్రీహరి, వినాయకుడు ఇద్దరూ ఒకరే. శ్రీహరి ఎలా కాలస్వరూపుడో, వినాయకుడు కాలస్వరూపుడే. విఘ్నమనేది వచ్చేది కాలానికే. అంటే కాలనుగుణంగానే అందుకని ఈ శ్లోకం వినాయకుని రూపంలో ఉన్న విష్ణువుకే లేదా విష్ణురూపంలో ఉన్న వినాయకునికీ సంబంధించిందన్నమాట ఈ ఇద్దరు ఒకటే కాబట్టి లక్ష్మీగణపతికి గల సంబంధము.

ఇలాంటి వినాయకుడిని ప్రార్థిస్తే విఘ్నాలుతొలగడం, విష్ణురక్షణని పొందడం, విశేషించి పార్వతీ పరమేశ్వరుల అండతో సిద్ధిస్తాయి. అందువల్లే రాహువు కేతువులు కాలస్వరూపులు. కాబట్టి కాలస్వరూపములకు అధిపతులు అమ్మవారు, గణపతి. అందుకే కాలసర్పయోగ పూజావిధానములో దుర్గా, గణపతులను పూజించాలి.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ

Ph: 9849280956, 9515900956