2025 Honda Dio 125 Launch
Honda Dio 125 : కొత్త స్కూటర్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా నుంచి సరికొత్త స్కూటర్ వచ్చేసింది. హోండా డియో 125 స్కూటర్ పేరుతో లాంచ్ చేసింది. టీవీఎస్ NTorq 125 వంటి స్కూటర్లకు పోటీగా ఈ 125cc స్కూటర్ కొత్త ఫీచర్లు ఇంజిన్ అప్‌గ్రేడ్‌తో ఆకర్షణీయంగా ఉంది.
ఇందులో కొత్త OBD 2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. 2025 డియో 125 స్కూటర్ ధరలు DLX వేరియంట్‌కు రూ. 96,749 నుంచి ప్రారంభమై H-స్మార్ట్ స్కూటర్ వేరియంట్ రూ. 1.02 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంటాయి.
2025 హోండా డియో125 ఇంజిన్ స్పెసిఫికేషన్లు :
హోండా డియో 125 అప్‌డేట్స్ అదే 123.92cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. 8.19hp, 10.5Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అడ్వాన్స్ ఐడ్లింగ్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్‌తో వస్తుంది.
2025 హోండా డియో 125 ఫీచర్లు :
2025 నాటికి డియో కొత్త 4.2-అంగుళాల TFT డిస్‌ప్లేతో వస్తుంది. కొత్త యాక్టివా 125, బ్రాండ్ నుంచి ఇతర టూవీలర్ వాహనాల్లో మాదిరిగానే ఉంటుంది. హోండా రోడ్‌సింక్ యాప్‌కి సింకరైజ్ అవుతుంది. రేంజ్, ట్రిప్ మీటర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్‌ల కోసం రీడౌట్‌లను అందిస్తుంది.
2025 హోండా డియో 125 కలర్ ఆప్షన్లు :
హోండా కొత్త డియోలో గ్రాఫిక్స్‌ను కూడా అప్‌డేట్ చేసింది. రెండు వేరియంట్‌లలో 5 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ స్పోర్ట్స్ ఎల్లో, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ ఇంపీరియల్ రెడ్ వంటి ఆప్షన్లను కలిగి ఉంది.