One UI 7 Update : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త వన్ UI 7 అప్‌డేట్ రిలీజ్.. మీరు వాడే మోడల్ ఇదేనా? గెట్ రెడీ!
One UI 7 Update : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ కోసం One UI 7 కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఏప్రిల్ 22, 2025 నుంచి రిలీజ్ కానుంది. మీరు వాడే మోడల్ ఫోన్ ఇదే అయితే రెడీగా ఉండండి.

One UI 7 Update
One UI 7 Update : శాంసంగ్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీరు శాంసంగ్ గెలాక్సీ S23 యూజర్ అయితే మీకోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రిలీజ్ అవుతోంది. శాంసంగ్ వచ్చే వారం ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7 అప్‌డేట్‌ను రిలీజ్ చేయనుంది.
ఈ కొత్త అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు అతి త్వరలో అందుబాటులోకి రానుంది. శాంసంగ్ మొదట్లో ఏప్రిల్ 7, 2025న గెలాక్సీ S24 సిరీస్, గెలాక్సీ Z ఫోల్డ్ 6, గెలాక్సీ Z ఫ్లిప్ 6 కోసం స్టేబుల్ వన్ UI 7 అప్‌డేట్‌ను రిలీజ్ చేయడం ప్రారంభించింది.
అయితే, కొత్త అప్‌డేట్‌లో బగ్ కారణంగా కంపెనీ త్వరలోనే రోల్ అవుట్‌ను పాజ్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు ఆ బగ్ ఇష్యూను ఫిక్స్ చేసింది. కొత్త అప్‌డేట్ అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు శాంసంగ్ ధృవీకరించింది. ముందుగా శాంసంగ్ గెలాక్సీ S23 లైనప్‌కు ఈ కొత్త వన్ UI 7 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇటీవలి నివేదికల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ కోసం వన్ UI 7 అప్‌డేట్ ఏప్రిల్ 22, 2025 నుంచి రిలీజ్ కానుంది.
వన్ UI 7 ఫీచర్లు :
శాంసంగ్ వన్ UI 7 మీ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ వేగంగా రన్ అయ్యే ఫీచర్‌లను అందిస్తుంది.
విజువల్ మేక్ఓవర్ : వన్ UI 7 రీడిజైన్ ఐకాన్స్ సున్నితమైన యానిమేషన్, క్లీనర్ లేఅవుట్‌లతో ఫుల్ విజువల్ రిఫ్రెష్‌ను అందిస్తుంది.
స్మార్ట్ క్విక్ ప్యానెల్ : స్క్రీన్ లెఫ్ట్ సైడ్ నుంచి కిందికి స్వైప్ చేయడం వల్ల మీ నోటిఫికేషన్‌లు కనిపిస్తాయి. రైడ్ సైడ్ టోగుల్స్, స్లయిడర్‌లను అందిస్తుంది.
లాక్ స్క్రీన్‌లో నౌ బార్ : లాక్ స్క్రీన్‌పై కొత్త నౌ బార్ మ్యూజిక్ ప్లేయర్, వాయిస్ రికార్డర్ లేదా ఇంటర్‌ప్రెటర్ మోడ్ వంటి రియల్ టైమ్ డేటాను డిస్‌ప్లే చేస్తుంది.
స్మూతర్ యానిమేషన్లు : సిస్టమ్ అంతటా ట్రాన్సిషన్స్ ఇప్పుడు వేగంగా మరింత అప్‌గ్రేడ్ అయ్యాయి.
రిఫ్రెష్ కెమెరా ఇంటర్‌ఫేస్ : కెమెరా UI క్లీనర్ లేఅవుట్‌ను కలిగి ఉంది. కంట్రోలింగ్ మరింత అందుబాటులో ఉంటుంది.
కొత్త బ్యాటరీ ఐకాన్ : బ్యాటరీ ఐకాన్ ఇప్పుడు బ్యాటరీ పర్సటెంజ్ చూపించే పిల్-ఆకారపు డిజైన్‌ను కలిగి ఉంది.
బెటర్ గెలాక్సీ ఏఐ : ప్రొడక్టివిటీతో పాటు మరిన్నింటి కోసం అప్‌గ్రేడ్ ఏఐ టూల్స్ అందిస్తుంది.
ఏ శాంసంగ్ ఫోన్లలో OneUI 7 అప్‌డేట్ రానుంది? :
ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ UI 7 రిలీజ్ ప్రారంభ దశలో గత ఏడాది ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లైన గెలాక్సీ S24, గెలాక్సీ S24 ప్లస్, గెలాక్సీ S24 అల్ట్రాతో సహా గెలాక్సీ S24 సిరీస్ అప్‌డేట్‌ను అందుకోనున్నాయి. ఈ ఫోన్లతో పాటు, గెలాక్సీ Z ఫోల్డ్ 6, గెలాక్సీ Z ఫ్లిప్ 6 కూడా కొత్త అప్‌డేట్ అందుకోనున్నాయని శాంసంగ్ ధృవీకరించింది. శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ వంటి ఫోన్లలో ఈ అప్‌డేట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వేచి చూడాల్సిందే.
OneUI 7 డౌన్‌లోడ్ చేసుకోవాలా? :
ప్రస్తుతానికి, ఈ అప్‌డేట్ దక్షిణ కొరియాతో సహా నిర్దిష్ట ప్రాంతాల్లో దశలవారీగా రిలీజ్ అవుతోంది. ఇది స్టేబుల్ అప్‌డేట్. బీటా కాదు. శాంసంగ్ అధికారిక రోల్ అవుట్ తర్వాత అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బగ్ కారణంగా రిలీజ్ ఆలస్యమైంది.
అతి త్వరలో అందరి శాంసంగ్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. శాంసంగ్ యూజర్లు ముందుగా తమ డేటాను ప్రొటెక్ట్ చేసుకునేందుకు బ్యాకప్ (క్లౌడ్ లేదా లోకల్‌లో) ఉంచుకోవడం ఎంతైనా మంచిది.