Redmi A5 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి A5 సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి.. మనసుకు నచ్చితే కొనేవరకు అసలు ఉండలేరు..!
Redmi A5 Sale : రెడ్‌మి A5 ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా రెడ్‌మి A5 కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ ధర, ఫుల్ స్పెషిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Redmi A5 Sale
Redmi A5 Sale : రెడ్‌మి ఫ్యాన్స్‌కు అదిరే న్యూస్.. భారత మార్కెట్లో తొలిసారిగా రెడ్‌మి A5 ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 5,200mAh బ్యాటరీ ఉన్నాయి.
లేటెస్ట్ రెడ్‌మి A5 ఫోన్ 3GB/64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.6,499గా ఉండగా, 4GB/128GB మోడల్ ధర రూ.7,499గా ఉంది. జైసల్మేర్ గోల్డ్, జస్ట్ బ్లాక్, పాండిచ్చేరి బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రెడ్‌మి A5 ఫోన్ ఈరోజు (ఏప్రిల్ 16) మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫస్ట్ సేల్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
రెడ్‌మి A5 కొనాలా? వద్దా? :
మీరు రూ.10వేల లోపు బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ కోసం చూస్తున్నారా? రెడ్‌మి A5 అనేది 6.88-అంగుళాల HD+ (720×1,640 పిక్సెల్స్) డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, (TÜV) రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌తో వస్తోంది. 4GB వరకు ర్యామ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. రెడ్‌మి A5 డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందిస్తుంది. ఇందులో 32MP ప్రైమరీ కెమెరా, సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. అంతేకాకుండా, ఈ రెడ్‌మి ఫోన్ 15W వైర్డ్ ఛార్జింగ్‌తో 5,200mAh బ్యాటరీని అందిస్తుంది.
దుమ్ము, నీటి నిరోధకతకు IP52 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికొస్తే.. ఇందులో Wi-Fi, బ్లూటూత్, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. చివరగా, ఫోన్ 8.26mm కొలతలు, 193 గ్రాముల బరువు ఉంటుంది.