2025 Triumph Twin 900 Launch : ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైక్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

2025 Triumph Twin 900 Launch : కొత్త స్పీడ్ ట్విన్ 900 బైక్ బోల్డ్ యాక్సెంట్‌లతో ప్యూర్ వైట్, గోల్డ్ హైలైట్‌లతో ఫాంటమ్ బ్లాక్, రెడ్ అవుట్‌లైన్‌తో అల్యూమినియం సిల్వర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 

2025 Triumph Twin 900 Launch : ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైక్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

2025 Triumph Twin 900 Launch

Updated On : December 24, 2024 / 3:12 PM IST

2025 Triumph Speed Twin 900 Launch : ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భారత మార్కెట్లో అప్‌డేట్ చేసిన స్పీడ్ ట్విన్ 900 లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 8.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు అందిస్తోంది. 2025 మోడల్ రిఫ్రెష్డ్ డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ఛాసిస్‌ను కలిగి ఉంది.

స్పీడ్ ట్విన్ 900 మోడల్ 900సీసీ  (2025 Triumph Speed Twin 900) బోన్నెవిల్లే ట్విన్ ఇంజన్‌ను కలిగి ఉంది. 7,500ఆర్‌పీఎమ్ వద్ద 65పీఎస్, 3,800ఆర్‌పీఎమ్ వద్ద 80ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. వివిధ ఉపరితల పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన రోడ్, రెయిన్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అదనంగా, కొత్త లీన్-సెన్సిటివ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సమయంలో మెరుగైన కంట్రోలింగ్ అందిస్తుంది. బైక్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు ఉంటుంది.

అప్‌డేట్ చేసిన స్పీడ్ ట్విన్ 900లో మార్జోచి అప్‌సైడ్-డౌన్ ఫోర్కులు స్పోర్టి ఫ్రంట్ మడ్‌గార్డ్, ఫోర్క్ ప్రొటెక్టర్‌లతో వస్తుంది. బ్యాక్ సైడ్ కొత్తగా కల్పించిన అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్, పిగ్గీబ్యాక్ బ్యాక్ సస్పెన్షన్ యూనిట్‌లను కలిగి ఉంది. ఇరుకైన బ్యాక్ ఫ్రేమ్, స్లీకర్ మడ్‌గార్డ్, కాంపాక్ట్ టెయిల్ లైట్‌తో ఇంటిగ్రేట్ అయింది. బ్రేకింగ్ సిస్టమ్ పెద్ద 320ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్, 4-పిస్టన్ కాలిపర్‌తో అప్‌గ్రేడ్ అయింది. మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

2025 Triumph Twin 900 Launch

2025 Triumph Twin 900 Launch

బెంచ్ సీటు రీడిజైన్ అయింది. ఇప్పుడు మరింత సన్నగా ఉంది. కార్నరింగ్ సమయంలో రైడర్‌కు మెరుగైన సపోర్టును అందిస్తోంది. అయితే, మరింత విశాలమైన సౌకర్యవంతమైన అదనపు లెగ్‌రూమ్‌ను అందిస్తుంది. అప్‌డేట్ చేసిన స్పీడ్ ట్విన్ 900 ఇప్పుడు ఎక్కువ విజిబిలిటీ కోసం స్లిమ్ డీఆర్ఎల్ హెడ్‌లైట్‌తో సహా ఆల్-ఎల్ఈడీ లైటింగ్ సెటప్‌ను పొందుతుంది. ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900ని రైడింగ్ మోడ్ ఇండికేటర్‌లతో కూడిన కొత్త టీఎఫ్టీ డిస్‌ప్లేతో అమర్చింది. బైక్ బ్లూటూత్ కనెక్టివిటీ మాడ్యూల్‌ను కూడా పొందుతుంది.

టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను ఎనేబుల్ చేస్తుంది. రైడర్‌లు వారి స్మార్ట్‌ఫోన్ నుంచి నేరుగా ఫోన్ కాల్స్, మ్యూజిక్ వీక్షించడానికి, కంట్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది. స్పీడ్ ట్విన్ 900 యూఎస్‌బీ-సి పోర్ట్‌ను కలిగి ఉంది. ట్రయంఫ్ కస్టమైజ్ చేసేందుకు వైడ్ రేంజ్ అప్లియన్సెస్ అందిస్తుంది. క్రూయిజ్ కంట్రోల్ కూడా ఇప్పుడు కూడా అందిస్తుంది.

కొత్త స్పీడ్ ట్విన్ 900 బైక్ బోల్డ్ యాక్సెంట్‌లతో ప్యూర్ వైట్, గోల్డ్ హైలైట్‌లతో ఫాంటమ్ బ్లాక్, రెడ్ అవుట్‌లైన్‌తో అల్యూమినియం సిల్వర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Read Also : Bikers Mileage Tips : ఇలా బైక్ డ్రైవింగ్ చేసి చూడండి.. 100 శాతం మైలేజీ గ్యారంటీ.. 99శాతం మందికి ఈ ట్రిక్ తెలియదు..!