Bikers Mileage Tips : ఇలా బైక్ డ్రైవింగ్ చేసి చూడండి.. 100 శాతం మైలేజీ గ్యారంటీ.. 99శాతం మందికి ఈ ట్రిక్ తెలియదు..!
Bikers Mileage Tips : మీ బైక్ మైలేజీ రావడం లేదని ఆందోళన చెందకండి. మీరు బైక్ ఈ విధంగా డ్రైవింగ్ చేయడం ద్వారా స్పీడ్ మాత్రమే కాదు.. మైలేజీ కూడా బాగా వస్తుంది.

Bikers ride in safe rpm and speed range to increase mileage Telugu
Bikers Mileage Tips : బైక్ నడిపేవారికి అద్భుతమైన టిప్.. మీ బైక్ మైలేజీ రావడం లేదని ఆందోళన చెందకండి. మీరు బైక్ ఈ విధంగా డ్రైవింగ్ చేయడం ద్వారా స్పీడ్ మాత్రమే కాదు.. మైలేజీ కూడా బాగా వస్తుంది. సాధారణంగా చాలా మంది బైక్ రైడర్లు తాము నడిపే బైక్ పెద్దగా మైలేజీ ఇవ్వడం లేదని అంటుంటారు.
కొన్న కొత్తలో కంపెనీ చెప్పినంత బైక్ మైలేజీని ఎప్పుడూ ఇవ్వలేదని తరచూ కంప్లెయింట్ చేస్తుంటారు. మరికొంతమంది తమ బైక్‌ను సమయానికి సర్వీస్ చేసి, చక్కగా మెయింటెయిన్ చేస్తున్నప్పటికీ కూడా బైక్ మంచి మైలేజీని ఇవ్వలేదని ఆందోళన చెందేవారు లేకపోలేదు. కానీ, బైక్ మైలేజ్ ఇంజిన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు రైడ్ చేసే విధానం కూడా మైలేజీని ప్రభావితం చేస్తుందని గమనించాలి.
మీకు కూడా అదే సమస్య ఉంటే.. సరైన వేగంతో ఆర్పీమ్ (RPM)తో బైక్‌ను నడపాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే కంపెనీ పేర్కొన్న మైలేజీని అందిస్తుంది. మీ బైక్ నుంచి మంచి మైలేజీని పొందాలనుకుంటే.. మీరు సేఫ్ ఆర్పీఎమ్ సురక్షితమైన స్పీడ్ రేంజ్ గురించి తెలుసుకోవాలి.
మెరుగైన మైలేజీ కోసం బైక్‌ను సేఫ్ ఆర్పీఎమ్‌లో నడపండి. ఈ పొరపాటు వల్ల బైక్‌లు, స్కూటర్లకు ఎప్పుడూ తక్కువ మైలేజీ వస్తుంది. ఆర్పీఎమ్ పెంచడం ద్వారా ఇంజిన్ మరింత వేగంగా పనిచేస్తుంది. తద్వారా మరింత శక్తిని అందించడమే కాకుండా మైలేజీని తగ్గిస్తుంది. అయితే, ఆర్పీఎమ్ చాలా తక్కువగా ఉంటే.. వేగం తగ్గుతుంది. ఈ సందర్భంలో కూడా మీరు మెరుగైన మైలేజీని పొందలేరు.
సేఫ్ ఆర్పీఎమ్ అనేది సాధారణంగా బైక్ సురక్షితమైన ఆర్పీఎమ్ దాని పరిధిలో 40శాతం నుంచి 60శాతం ఉంటుంది. ఈ సమయంలో బైక్ ఇంజిన్ వేగంగా పని చేస్తుంది. ఉదాహరణకు.. మీ బైక్ గరిష్ట ఆర్పీఎమ్ పరిమితి 9000 ఆర్పీఎమ్ అయితే, సురక్షితమైన ఆర్పీఎమ్ పరిధి 3600-5400 ఆర్పీఎమ్ వరకు ఉంటుంది. బైక్‌ను సురక్షితమైన ఆర్పీఎమ్ రేంజ్‌లో నడపడం వల్ల ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి ఉండదు. ఫలితంగా బైక్ లైఫ్ టైమ్ కూడా పెరుగుతుంది.
మైలేజ్ కోసం సేఫ్ స్పీడ్ రేంజ్‌లో బైక్ రైడ్ :
సురక్షితమైన ఆర్పీఎమ్ మాదిరిగా మైలేజీకి సేఫ్ స్పీడ్ రేంజ్ కూడా అంతే ముఖ్యం. చాలా బైక్‌లకు, సేఫ్ స్పీడ్ వాటి టాప్ స్పీడ్ 40 శాతం నుంచి 60శాతంగా పరిగణిస్తుంది. ఉదాహరణకు.. బైక్ టాప స్పీడ్ గంటకు 100కి.మీ అయితే, సేఫ్ స్పీడ్ గంటకు 40కి.మీ నుంచి 60 కి.మీ దూసుకుపోతుంది. ఈ స్పీడ్‌తో బైక్ నడపడం వల్ల ఫ్యూయల్ సేవ్ అవడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా తగ్గుతాయి.
నోట్ : బైకు గేర్‌లను మార్చేటప్పుడు ఎల్లప్పుడూ ఆర్పీఎమ్ గుర్తుంచుకోండి. హై ఆర్పీఎమ్ వద్ద బైక్‌ను నడపడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. లాంగ్ డ్రైవ్ బయలుదేరే ముందు, బైక్ మాన్యువల్ బుక్‌లో ఇచ్చిన మీ బైక్ టాప్ ఆర్పీఎమ్ సురక్షిత వేగాన్ని తప్పక తెలుసుకోవాలి.