Xiaomi 15 Pro Leak : మూడు కలర్ ఆప్షన్లలో కొత్త షావోమీ 15 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే స్పెసిఫికేషన్లు లీక్..!
Xiaomi 15 Pro Leak : సరికొత్త షావోమీ 15ప్రో ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందుగానే షావోమీ 15ప్రో స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. 2023లో లాంచ్ అయిన షావోమీ 14ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా త్వరలో ఆవిష్కరించనున్నట్టు భావిస్తున్నారు.

Xiaomi 15 Pro Specifications Leaked Alongside Images
Xiaomi 15 Pro Leak : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి సరికొత్త షావోమీ 15ప్రో ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందుగానే షావోమీ 15ప్రో స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. గత నవంబర్ 2023లో లాంచ్ అయిన షావోమీ 14ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా త్వరలో ఆవిష్కరించనున్నట్టు భావిస్తున్నారు.
నివేదిక ప్రకారం.. ఈ హ్యాండ్సెట్ స్పెసిఫికేషన్లను ముందుగానే లీక్ అయ్యాయి. ఫోన్ బ్యాక్ ప్యానెల్‌ను సూచించే స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు ఫొటోలు రివీల్ అయ్యాయి. షావోమీ 15 ప్రో లైకా-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చి ఉన్నట్లు కనిపిస్తోంది. షావోమీ నుంచి రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో ఎంపికలలో అందుబాటులో ఉంటుందని ఫొటోలు సూచిస్తున్నాయి.
షావోమీ 15 ప్రో డిజైన్, కలర్ ఆప్షన్లు (లీక్) :
స్మార్ట్‌ప్రిక్స్ సహకారంతో టిప్‌స్టర్ లీక్ చేసిన షావోమీ 15 ప్రో ఫొటోలు హ్యాండ్‌సెట్‌ను బ్లాక్, వైట్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. షావోమీ 14 ప్రో అప్‌గ్రేడ్ కూడా గత ఏడాది మోడల్ మాదిరిగానే టైటానియం ఎడిషన్‌లో అందుబాటులో ఉండనుంది. హ్యాండ్సెట్ లీకైన రెండర్లు టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చి ఉన్నాయని సూచిస్తున్నాయి. అయితే, ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్‌కు రైట్ సైడ్ ఉంది. ఈ ఫోన్ బాటమ్ లెఫ్ట్ సైడ్ బ్రాండ్ పేరును సూచిస్తుంది.
షావోమీ 15ప్రో స్పెసిఫికేషన్లు (లీక్) :
నివేదిక ప్రకారం.. షావోమీ 15 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 చిప్సెట్తో అమర్చి ఉంటుంది. ఈ నెల చివరిలో లాంచ్ కానుందని భావిస్తున్నారు. దీనితో పాటు 16జీబీ వరకు ర్యామ్, 1టీబీ వరకు స్టోరేజీని కలిగి ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 2కె కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని కూడా అంచనా.
రాబోయే షావోమీ 15 ప్రో కూడా లైట్ ఫ్యూజన్ 900 సిరీస్ సెన్సార్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, సోనీ ఐఎమ్ఎక్స్858 లెన్స్‌తో కూడిన 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, లైకా-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన టెలిఫోటో కెమెరా, మాక్రో మోడ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
ముందు భాగంలో, హ్యాండ్‌సెట్‌లో 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. షావోమీ 15 ప్రో ఇతర లీకైన స్పెసిఫికేషన్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 90డబ్ల్యూ (వైర్డ్), 80డబ్ల్యూ (వైర్లెస్) వద్ద ఛార్జ్ చేయగల 6,000mAh బ్యాటరీ ఉన్నాయి. అలాగే, 10డబ్ల్యూ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. షావోమీ 15 ప్రో కూడా ఆండ్రాయిడ్ 15లో హైపర్ఓఎస్ 2తో రన్ అవుతుంది. ఐదేళ్ల వరకు ఓఎస్ అప్గ్రేడ్లను అందుకుంటుంది.