×
Ad

Best Smartphones : ప్రతి గేమర్ కొనాల్సిన ఫోన్లు.. రూ. 40వేల లోపు BGMI 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఏది కొంటారో కొనేసుకోండి!

Best Smartphones : గేమింగ్ ఫోన్లకు మార్కెట్లో ఫుల్ క్రేజ్ ఉంది. ప్రత్యేకించి గేమింగ్ ఆడే యూజర్లు BGMI సపోర్టు చేసే ఫోన్ల కోసం చూస్తుంటారు. మీరు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి.

5 Best Smartphones

Best Smartphones : గేమింగ్ ఫోన్ యూజర్లకు పండగే.. మీరు గేమ్స్ ఆడుతుంటారా? అయితే మీకోసం అద్భుతమైన గేమింగ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు BGMI లవర్స్ అయితే ఈ ఫోన్లలో ఏదో ఒకటి కొనేసుకోండి.

అన్ని మొబైల్ గేమ్‌లకు సరిపోయే ఫోన్ దొరకలేదా? అయితే, మీకోసం కొన్ని టాప్ గేమింగ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 5 స్మార్ట్‌ఫోన్‌లు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. రియల్‌మి నుంచి ఐక్యూ వరకు ఏ ఫోన్ కొనేసుకుంటారో కొనేసుకోండి.

వన్‌ప్లస్ నార్డ్ 5 (రూ. 39,999) :
వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ 1B కలర్ ఆప్షన్లలో 6.83-అంగుళాల స్విఫ్ట్ అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో ఈ యూనిట్ ఆక్సిజన్ OS 15పై రన్ అవుతుంది. ఇంకా, 50MP + 8MP బ్యాక్ కెమెరా , 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.

​రియల్‌మి GT7 (రూ. 39,999) :
రియల్‌మి GT7లో 7000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 1B కలర్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. చివరగా, 50MP + 50MP + 8MP కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

Read Also : Triumph Bikes Price : బిగ్ షాకింగ్.. భారీగా పెరగనున్న ట్రయంఫ్ బైకుల ధరలు.. జనవరి 1 నుంచే అమల్లోకి.. ఇప్పుడే బుక్ చేసుకోండి!

ఐక్యూ నియో 10R (రూ. 30,999) :
ఐక్యూ నియో 10R ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అయ్యే 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6400mAh బ్యాటరీని కలిగి ఉంది. 1B కలర్ ఆప్షన్లతో 6.78-అంగుళాల అమోల్డ్ 144Hz రిఫ్రెష్ రేట్ , 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. 50MP వెడల్పు, 8MP అల్ట్రావైడ్ 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.

వివో V60 (రూ. 38,999) :
వివో V60 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 90W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. 1B కలర్‌లతో 6.77-అంగుళాల అమోల్డ్, HDR10+, 120Hz రిఫ్రెష్ రేట్ , 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. 50MP + 50MP + 8MP కెమెరా ఫీచర్లు కలిగి ఉంది.

​రియల్‌మి 15 ప్రో 5G (రూ. 31,999) :
రియల్‌మి 15 ప్రో 5G స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది. 6.8-అంగుళాల OLED కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ యూనిట్ డ్యూయల్ 50MP కెమెరా , 7000mAh బ్యాటరీ లైఫ్‌తో 50MP సెల్ఫీ కెమెరా ఉంది.