Gold Loan : బంగారంపై రుణం తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

Gold Loan : గోల్డ్ లోన్ అనేది ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలను అధిగమించడంలో సాయపడుతుంది. అయితే, మీరు లోన్ కోసం అప్లయ్ చేసే ముందు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.

5 Things You Should Know Before Getting a Gold Loan

Gold Loan : ప్రస్తుత రోజుల్లో బంగారానికి ఉన్న విలువ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొన్ని శతాబ్దాలుగా బంగారంపై రుణం తీసుకోవడం అనేది భారతీయులకు సర్వసాధారణంగా మారిపోయింది. కొన్ని గడ్డుకాల పరిస్థితుల్లో చేతుల్లో చిల్లిగవ్వలేనప్పుడు ఆపద్బాంధవుడిలా బంగారమే ఆదుకుంటుంది. ఇలాంటి పరిస్థితి ప్రతిఒక్కరిలో జీవితంలో ఏదో ఒక సమయాల్లో ఎదురయ్యే ఉంటుంది. చాలా మంది ఉపాధి కోల్పోయినప్పుడు లేదా తీవ్రమైన అప్పుల ఊబిలో చిక్కుకున్నప్పుడు బంగారమే మనల్ని ఆదుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

Read Also : Sovereign Gold Bond : గుడ్‌ న్యూస్.. బంగారంలో పెట్టుబడికి ఇదే బెస్ట్ టైమ్.. కేవలం 5 రోజులే సేల్.. గోల్డ్ గ్రాము ధర ఎంతంటే?

అంతేకాకుండా, పాఠశాల ఫీజులు, వైద్య ఖర్చులు, వ్యాపార ఖర్చులు మొదలైన ఖర్చులను నిర్వహించడంలో బంగారం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బంగారు ఆభరణాల ద్వారా ఆర్థిక సహాయం పొందడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. మన అవసరాలకు అనుగుణంగా రుణదాతలు వివిధ రకాల రుణాలను అందిస్తారు. కొన్ని కారణాల వల్ల బ్యాంకులో నగదు రుణాలు తిరస్కరించే సందర్భాలు ఉంటాయి.

బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టి రుణం :
అటువంటి పరిస్థితులలో, మీకు అత్యవసర ప్రాతిపదికన నిధులు అవసరమైనప్పుడు, మీ బంగారు ఆభరణాలు లేదా ఆభరణాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు. ఆకర్షణీయమైన పెట్టుబడి ఆప్షన్ కాకుండా, ఏదైనా ఆర్థిక సంక్షోభాన్నిఅధిగమించడానికి ప్రత్యేక ఈవెంట్‌కు లేదా మెడికల్ ఎమర్జెన్సీకి నిధులు సమకూర్చడంలో బంగారం చాలా సాయపడుతుంది. అత్యవసరంగా నగదు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పాటు సులభంగా తిరిగి పొందడం వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అయితే, మీరు బంగారంపై లోన్ పొందే ముందు తప్పనిసరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.

వడ్డీ రేటు :
మీరు నిజంగా గోల్డ్ లోన్‌ తీసుకోవాలని భావిస్తే.. ముందుగా వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో సరిపోల్చుకోండి. బంగారు రుణంపై వడ్డీ రేటును వివిధ బ్యాంకులు వేర్వేరుగా వసూలు చేస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది.

Gold Loans

లోన్ రీపేమెంట్ ఆప్షన్‌లు :
మీకు తక్కువ మొత్తంలో లోన్ అవసరమైతే.. ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు ఈఎంఐ లేకుండా గోల్డ్ లోన్ పొందేందుకు అనుమతిస్తాయి. ఈ సదుపాయం మీలాంటి రుణగ్రహీతలు కాల పరిమితి ముగిసే సమయానికి వడ్డీతో సహా మొత్తం రుణ మొత్తాన్ని చెల్లించడానికి అనుమతిస్తుంది. మీ ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుందని, మెచ్యూరిటీ తర్వాత మీరు లోన్ మొత్తాన్ని చెల్లించగలరని మీకు నమ్మకం ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ నెలవారీ సర్వీసింగ్ ఉత్పత్తిని కూడా అందిస్తుంది. తద్వారా మీకు వివిధ రీపేమెంట్ ఆప్షన్లను కూడా అందిస్తుంది.

లోన్ కాల వ్యవధి :
గోల్డ్ లోన్ అనేది స్వల్పకాలిక రుణాలు తీసుకునే స్కీమ్. కస్టమర్ అవసరాలకు అనుగుణంగా కాల పరిమితిపై ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. లోన్ కాల పరిమితి సాధారణంగా 6 నెలలు లేదా 12 నెలలు. లోన్ మొత్తాన్ని బట్టి మీరు గోల్డ్ లోన్ వ్యవధిని ఎంచుకోవచ్చు.

Getting Gold Loan

బంగారంపై లోన్ అమౌంట్ :
గోల్డ్ లోన్ పొందడం చాలా సులభమే.. ఎందుకంటే ఇందులో కనీస డాక్యుమెంటేషన్ ఉంటుంది. రుణ మొత్తాన్ని నిర్ణయించడంలో ఆదాయ రుజువు లేదా మీ క్రెడిట్ హిస్టరీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇతర రుణాలకు భిన్నంగా గోల్డ్ లోన్ మినహాయింపు అని చెప్పవచ్చు. అధిక రుణ మొత్తానికి అర్హత పొందడానికి బ్యాంకులు బంగారం స్వచ్ఛత, నికర బరువు, దాని విలువను మూల్యాంకనం చేస్తాయి.

రుణదాతలపై విశ్వాసం :
మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తే.. ఏదైనా జ్యువెలరీ షాప్ యజమాని వద్దకు అసలు వెళ్లరాదు. ఎందుకంటే.. మీ బంగారంపై అధిక వడ్డీ ఎక్కువగా వసూలు చేస్తారు. మీ బంగారం సురక్షితంగా ఉంటుందనే గ్యారెంటీ లేదు. మీ బంగారం విలువ సరిగ్గా ఉండకపోవచ్చు. ఎల్లప్పుడూ బ్యాంక్‌ ద్వారా గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం అన్నివిధాలా ఉత్తమంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. మీ బంగారానికి రక్షణ ఉంటుంది. చాలా సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా.. మీరు రుణదాత వద్ద తనఖా పెట్టిన బంగారం మదింపు ఆధారంగా మీరు లోన్ మొత్తాన్ని పొందవచ్చు.

Read Also : Gold Prediction 2024: గోల్డ్ కొంటున్నారా? 2024లోనూ బంగారం ధర ఆ స్థాయిలో పెరుగుతుందా? సర్వేలో ఏం తేలింది?