8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. మే 31 వరకు డెడ్‌లైన్ పొడిగింపు. భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు.. ఎంతంటే?
8th Pay Commission : ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైనే ఫోకస్.. వేతన సంఘం నుంచి 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను ఎన్సీ-జేసీఎం డిమాండ్ చేసింది. ఇది ఆమోదం పొందితే, కనీస మూల వేతనం ప్రస్తుత రూ. 18వేల నుంచి రూ. 69,000కు పెరిగే అవకాశం ఉంది.
8th Pay Commission
- 8వ వేతన సంఘంపై కీలక అప్డేట్
- ఈ 8వ కమిషన్ డెడ్ లైన్ మే 31వరకు పొడిగింపు
- రూ. 18వేల నుంచి రూ. 69వేలకు జీతాలు పెరగొచ్చు
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్.. మెమోరాండాలను సమర్పించే గడువును 8వ వేతన సంఘం ఏప్రిల్ 30 నుంచి మే 31 వరకు పొడిగించింది. జాతీయ మండలి (NC-JCM) చేసిన డిమాండ్‌కు ప్రతిస్పందనగా కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పుడు వివిధ సంస్థలకు (8th Pay Commission) తమ డిమాండ్లను వివరించేందుకు మరింత సమయం ఉంటుంది.
మే 31 వరకు గడువు.. డిపాజిట్ విధానంలో మార్పు :
మెమోరాండాలను సమర్పించేందుకు గడువును 8వ పే కమిషన్ మే 31 వరకు పొడిగించింది. కానీ, సబ్మిషన్ విధానికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఇకపై అన్ని సమర్పణలు కమిషన్ నిర్దేశించిన ఆన్లైన్ లింక్ ద్వారా మాత్రమే చేయాలి.
కాగితంపై మెమోరాండాలు, హార్డ్ కాపీలు, పీడీఎఫ్‌లు లేదా ఇమెయిల్ ద్వారా పంపిన మెమోరాండాలను పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ స్పష్టం చేసింది. మంత్రిత్వ శాఖలు, విభాగాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అధీకృత నోడల్ అధికారులు తమ సూచనలను నిర్దేశించిన ఫార్మాట్లో ఆన్లైన్లో సమర్పించవచ్చు.
కమిషన్ గడువు పొడిగింపు ఎందుకంటే? :
జాతీయ సంయుక్త సంప్రదింపుల యంత్రాంగం మండలి (ఎన్సీ-జేసీఎం) మంగళవారం రోజున కమిషన్ ఛైర్పర్సన్ రంజనా ప్రకాష్ దేశాయ్‌తో సమావేశమైంది. అనేక సంస్థలు, పెన్షనర్ల సంఘాలు ఆన్లైన్లో వినతిపత్రాలు సమర్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
Read Also : Labour Day Holiday : మే 1న బ్యాంకులకు సెలవు ఉందా? తెరిచే ఉంటాయా? ఆర్బీఐ ఏం చెప్పిందంటే? ఫుల్ డిటెయిల్స్..!
ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఢిల్లీలో జరిగిన కీలక చర్చల అనంతరం గడువు పొడిగించారు. అయితే, ఈ గడువు పొడిగింపు ఫిట్మెంట్ అంశంపై తుది నిర్ణయం ఆలస్యం చేయవచ్చు. దాంతో ఉద్యోగులు పెరిగిన జీతాలను అందుకోవడానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుంది.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్, జీతంపై కీలక డిమాండ్లు ఇవే? :
ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది పెరిగితే ఉద్యోగుల జీతాలు కూడా భారీగా పెరుగుతాయి.
రూ. 69వేలు కనీస వేతనం :
పే కమిషన్ నుంచి 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను ఎన్సీ-జేసీఎం డిమాండ్ చేసింది. ఇదిగానీ ఆమోదిస్తే.. కనీస వేతనం ప్రస్తుత రూ. 18వేల నుంచి రూ. 69వేలకు పెరగవచ్చు.
వార్షిక పెంపు :
6శాతం వార్షిక జీతం పెంపును కోరుతూ విజ్ఞాపన పత్రం రూపొందించింది.
పదోన్నతి, గ్రాట్యుటీ :
పదోన్నతి సమయంలో ఇచ్చే రెండు అదనపు ఇంక్రిమెంట్ల ద్వారా కనీసం రూ. 10వేల బెనిఫిట్స్, నెల జీతానికి సమానమైన గ్రాట్యుటీని కూడా డిమాండ్ అందించే అవకాశం ఉంది.
కమిషన్ ఏం చేయనుంది? :
మెమోరాండాలను సమర్పించేందుకు కొత్త గడువు మే 31తో ముగియనుంది. ఆ తర్వాత, 8వ వేతన సంఘం అందిన అన్ని సూచనలు, సమాచారాన్ని క్షుణ్ణంగా విశ్లేషించనుంది. ఈ ప్రక్రియలో వివిధ ఉద్యోగ సంఘాలు, మంత్రిత్వ శాఖలు, కేంద్రపాలిత ప్రాంతాల నోడల్ అధికారులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా సమర్పించిన డిమాండ్లను ముఖ్యంగా 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రూ. 69వేలు కనీస వేతనం వంటి ప్రతిపాదనలను కమిషన్ పరిగణనలోకి తీసుకోనుంది.
ఛైర్పర్సన్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఈ ప్యానెల్ దీనికి సంబంధించి కీలక భాగస్వాములతో చర్చలు జరుపుతుంది. చివరగా, కమిషన్ వివరణాత్మక నివేదికను సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దీని ఆధారంగానే ఉద్యోగుల వేతనాల పెంపు, అలవెన్సులు, అన్నింటి అమలుపై కేబినెట్ ఫైనల్ డిసిషన్ తీసుకోనుంది.
