Zomato Pure Veg Fleet : జొమాటో ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’పై విమర్శలు.. గ్రీన్ కాదు.. రెడ్ డ్రెస్‌లోనే డెలివరీ.. సీఈఓ కీలక ప్రకటన!

Zomato Pure Veg Fleet : జొమాటో కొత్తగా ప్రారంభించిన ప్యూర్ వెజ్ ఫ్లీట్ సర్వీసులకు సంబంధించి గ్రీన్ డ్రెస్ కోడ్‌పై విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని కంపెనీ వెనక్కి తీసుకుంది. రైడర్లు రెడ్ డ్రెస్ కోడ్‌లోనే డెలివరీ చేస్తారని ప్రకటించింది.

All riders will wear red _ Zomato rolls back green uniform for pure-veg fleet amid social media backlash

Zomato Pure Veg Fleet : ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో ప్రత్యేకించి శాకాహారుల కోసం కొత్తగా ప్యూర్ వెజ్ ఫ్లీట్ మోడ్ సర్వీసులను ప్రారంభించిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా విమర్శలను ఎదుర్కొంది. ప్యూర్ వెజ్ ఫ్లీట్ సర్వీసుల కోసం ప్రత్యేకించి గ్రీన్ డ్రెస్ కోడ్ పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ కీలక ప్రకటన చేశారు. గ్రీన్ డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా వెల్లడించారు. జొమాటో రైడర్లందరూ ఎప్పటిలానే రెడ్ కలర్ డ్రెస్ కోడ్ ధరించే డెలివరీ చేస్తారని గోయల్ ప్రకటించారు. ప్యూర్ వెజ్ ఫ్లీట్ సర్వీసులు కొనసాగుతాయని, కానీ, గ్రీన్ డ్రెస్ కాకుండా రెడ్ కలర్ డ్రెస్ ధరించి డెలివరీ బాయ్స్ వెజిటేరియన్లకు ఫుడ్ డెలివరీ చేస్తారని ఆయన స్సష్టం చేశారు.

Read Also : Zomato Pure Veg Mode : వెజిటేరియన్ల కోసం జొమాటో కొత్త ‘ప్యూర్ వెజ్’ సర్వీసులు.. ఫస్ట్ డెలివరీ అందించిన కంపెనీ సీఈఓ

విమర్శలతో ‘గ్రీన్ డ్రెస్‌కోడ్’ నిర్ణయం వెనక్కి : 
నాన్ వెజ్, వెజ్‌కు రెడ్ డ్రెస్ మాత్రమే :‘శాకాహారుల కోసం ప్యూర్ వెజ్ ఫ్లీట్ కొనసాగిస్తాం. గ్రీన్ కలర్ డ్రెస్ తొలగించాలని నిర్ణయించాం. మా రైడర్లందరూ శాకాహారుల కోసం మా రెగ్యులర్ ఫ్లీట్, ప్యూర్ వెజ్ ఫ్లీట్ రెండింటికి ఎరుపు రంగును ధరిస్తారు’ అని గోయల్ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు. జొమాటో ప్యూర్ వెజ్ ఫ్లీట్ సర్వీసులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే నిలిపివేస్తామని గోయల్ పేర్కొన్నారు. గ్రీన్ డ్రెస్ ధరించడంపట్ల కొన్ని సామాజిక వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ సర్వీసుల వెనుక ఎలాంటి మతపరమైన, రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన తెలిపారు.

శాకాహార ఆహార ప్రాధాన్యత కలిగిన కస్టమర్ల కోసం కొత్త ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సర్వీసులను అందించే డెలివరీ రైడర్‌లు గ్రీన్ యూనిఫాం ధరించాలి. యాప్‌లోని ‘ప్యూర్ వెజ్’ మోడ్ స్వచ్ఛమైన శాకాహార ఆహారాన్ని మాత్రమే అందించే రెస్టారెంట్‌లను కలిగి ఉంటుంది. ఏదైనా నాన్-వెజ్ ఫుడ్ ఐటమ్స్ అందించే అన్ని రెస్టారెంట్‌లను వెజ్ ఆర్డర్ తీసుకోవడం ఉండదు. ఈ విషయంలో కస్టమర్లలో కొందరు ఇబ్బందుల్లో పడవచ్చని కంపెనీ గ్రహించిందని అది మంచిది కాదని రెండింటిగా నాన్ వెజ్, వెజ్ అని రెండుగా విభజించినట్టుగా తన ట్వీట్‌లో తెలిపారు.

 అందుకే నిర్ణయం తీసుకున్నాం :
‘కస్టమర్లలో చాలా మంది నాన్‌వెజ్‌ ఆర్డర్‌ చేస్తుంటారు. డెలివరీలో కొన్నిసార్లు పదార్థాలు ఒలికిపోతుంటాయి. అప్పుడు వాసన వస్తుంటుంది. అదే సమయంలో శాకాహార కస్టమర్లకు అలానే డెలివరీ చేస్తే వాసన వస్తుంటుంది. దాంతో వెజిటేరియన్లకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఫుడ్ ఫ్లీట్‌ను రెండు విధాలుగా విభజించాం. ప్యూర్‌ వెజిటేరియన్‌ హోటళ్ల నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసేవారి కోసమే ఇలా నిర్ణయం తీసుకున్నాం’ అని సీఈఓ వివరణ ఇచ్చారు. ప్రపంచంలో అత్యధిక శాతం శాకాహారులు భారత్‌లోనే ఉన్నారు, వారి నుంచి వచ్చిన ముఖ్యమైన అభిప్రాయాలలో ఒకటి ఏమిటంటే.. వారు తమ ఆహారాన్ని ఎలా వండుతారు? వారి ఆహారాన్ని ఎలా సర్వ్ చేస్తారు అనే దాని గురించే ఎక్కువగా చూస్తారని గోయల్ తెలిపారు.

టీ-షర్టు రంగును అలాగే ఉంచండి :
ప్యూర్ వెజ్ ఫ్లీట్ చర్చలో.. భారత్‌లో శాకాహార ఆహారంలో అతిపెద్ద మార్కెట్ ఉంది. జొమాటో స్వచ్ఛమైన వెజ్ డెలివరీ ఆప్షన్ అందించడమనేది కేవలం వ్యాపార ప్రయోజనం మాత్రమేనని సోషల్ మీడియా యూజర్ అన్నారు. దయచేసి శాకాహారులను కించపరిచేందుకు ప్రయత్నించకండి. అది వారి ఎంపిక. నమ్మకం కూడా.. మనం వారి పట్ల మరింత అనుకూలత సానుభూతితో ఉండాలని మరో యూజర్ పోస్టు చేశాడు. టీ-షర్టు రంగును అలాగే ఉంచండి. అవసరమైతే బ్యాడ్జ్ ధరించండి. ఆర్డర్ చేసే వ్యక్తికి అదేమి మారదని మరో యూజర్ పోస్ట్ చేశాడు.

Read Also : World’s Happiest Countries : 2024లో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాలివే.. టాప్‌లో ఫిన్‌‌లాండ్.. భారత్ ఎక్కడంటే?