Zomato Pure Veg Mode : వెజిటేరియన్ల కోసం జొమాటో కొత్త ‘ప్యూర్ వెజ్’ సర్వీసులు.. ఫస్ట్ డెలివరీ అందించిన కంపెనీ సీఈఓ

Zomato : ప్రత్యేకంగా శాకాహారం కోరుకునే కస్టమర్ల కోసం ఫుడ్ డెలివ‌రీ కంపెనీ జొమాటో ప్యూర్ వెజ్ మోడ్‌, ప్యూజ్ వెజ్ ఫ్లీట్ అనే సర్వీసులను ప్రవేశపెట్టింది.

Zomato Pure Veg Mode : వెజిటేరియన్ల కోసం జొమాటో కొత్త ‘ప్యూర్ వెజ్’ సర్వీసులు.. ఫస్ట్ డెలివరీ అందించిన కంపెనీ సీఈఓ

Zomato launches 'Pure Veg Mode, Pure Veg Fleet', CEO steps out for delivery

Updated On : March 19, 2024 / 8:11 PM IST

Zomato Pure Veg Mode : ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కొత్త సర్వీసులను ప్రారంభించింది. ప్రత్యేకించి శాకాహారుల కోసం సరికొత్త ‘ప్యూర్ వెజ్ మోడ్, ప్యూర్ వెజ్ ఫ్లీట్’ అనే వెజిటేరియన్ ఫుడ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. 100 శాతం శాకాహారం కోరుకునే వినియోగదారులే లక్ష్యంగా ఈ వెజ్ మోడ్ సర్వీసులను ప్రారంభించినట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ ట్విట్టర్ (X) వేదికగా ఈ ప్రకటన చేశారు.

ప్రపంచంలో భారత్‌లోనే అత్యధిక శాకాహారులు ఉన్నారని, వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే వారు తమ ఆహారాన్ని ఎలా వండుతారు? వారి ఆహారాన్ని ఎలా తీసుకుస్తారు అనేదాని గురించి చాలా నిర్దిష్టంగా ఉంటారని గోయల్ చెప్పారు. దేశంలోని శాకాహారుల నుంచి అందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సర్వీసులను ప్రారంభించినట్లు ఫుడ్ డెలివరీ కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగితో కలిసి గోయల్ స్వయంగా డెలివరీ అందజేశారు.

అంతేకాదు.. వినియోగదారుల ఆహార ప్రాధాన్యతలను పరిష్కరించడానికి 100 శాతం శాకాహార ఆహార ప్రాధాన్యత కలిగిన కస్టమర్‌ల కోసం జొమాటోలో ప్యూర్ వెజ్ ఫ్లీట్‌తో పాటు ప్యూర్ వెజ్ మోడ్ కూడా ప్రారంభించామని గోయల్ చెప్పారు.

మతపరంగా, రాజకీయ వివక్ష ఉండదు :
ప్యూర్ వెజ్ మోడ్‌లోని రెస్టారెంట్‌లు శాకాహార ఆహారాన్ని మాత్రమే అందించే అవుట్‌లెట్‌ల జాబితాను కలిగి ఉన్నాయి. ప్యూర్ వెజ్ మోడ్‌లో స్వచ్ఛమైన శాకాహార ఆహారాన్ని అందించే రెస్టారెంట్ల క్యూరేషన్ ఉంటుంది. అందులో నాన్-వెజ్ ఫుడ్ ఐటెమ్‌ను అందించే ఇతర రెస్టారెంట్‌లను మినహాయిస్తుందని గోయల్ తెలిపారు. కొత్తగా ప్రారంభించిన సర్వీసు ద్వారా ఎలాంటి మతపరమైన లేదా రాజకీయ ప్రాధాన్యతల పట్ల వివక్ష చూపదని గోయల్ స్పష్టం చేశారు.

భవిష్యత్తులో మరిన్ని స్పెషల్ ఫ్లీట్స్ తీసుకొస్తాం :
దయచేసి ఈ ప్యూర్ వెజ్ మోడ్ లేదా ప్యూర్ వెజ్ ఫ్లీట్ ఏ మతపరమైన లేదా రాజకీయ ప్రాధాన్యతలకు సర్వీసు చేయదని గమనించాలని ఆయన అన్నారు. కస్టమర్ల ప్రత్యేక అవసరాల కోసం ఇలాంటి మరిన్ని ఫ్లీట్‌లను అందించేలా భవిష్యత్తు ప్రణాళికలు చేస్తున్నట్టు తెలిపారు.

రాబోయే రోజుల్లో ప్రత్యేక కస్టమర్ అవసరాల కోసం మరిన్ని ప్రత్యేక ప్లీట్లను చేర్చాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఉదాహరణకు.. డెలివరీ సమయంలో మీ కేక్ స్మడ్జ్ కాకుండా హైడ్రాలిక్ బ్యాలెన్సర్‌లతో ప్రత్యేక కేక్ డెలివరీ ఫ్లీట్ వస్తోందని గోయల్ చెప్పారు. రాబోయే కొద్ది వారాల్లో ప్రత్యేక కేక్ డెలివరీ ఫ్లీట్ అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.