Amazon Blockbuster Sale: అమెజాన్ బ్లాక్‌బస్టర్ వాల్యూ డేస్ సేల్ 2023.. ఏసీ, కూలర్‌లపై ప్రీమియం డీల్స్ ఇవే..!

Amazon Blockbuster Value Days : అసలే సమ్మర్.. ఎండలు మండిపోతున్నాయి. వేడి కారణంగా ఉక్కపోతగా అనిపిస్తుంటుంది. కొత్త ఏసీ కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం..

Amazon Blockbuster Sale: అమెజాన్ బ్లాక్‌బస్టర్ వాల్యూ డేస్ సేల్ 2023.. ఏసీ, కూలర్‌లపై ప్రీమియం డీల్స్ ఇవే..!

Amazon Blockbuster Value Days Sale 2023 _ Premium deals on AC and coolers

Updated On : April 15, 2023 / 9:49 PM IST

Amazon Blockbuster Value Days Sale 2023 : సమ్మర్‌లో కొత్త ఏసీ, కూలర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) బ్లాక్ బస్టర్ వాల్యూ డేస్ సేల్ 2023 (Amazon Blockbuster Value Days Sale 2023)ని ప్రారంభించింది. వివిధ గృహోపకరణాలపై యూజర్లకు 70 శాతం కన్నా ఎక్కువ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, వాక్యూమ్ క్లీనర్లు, మైక్రోవేవ్ ఓవెన్‌లు, మిక్సర్ గ్రైండర్లు, ఎయిర్ ఫ్రయ్యర్లు, వాల్ క్లాక్‌లు, స్పిన్ మాప్‌లపై అద్భుతమైన డీల్‌ అందిస్తోంది.

ఈ తగ్గింపులతో పాటు, కస్టమర్‌లు (SBI Credit Card) క్రెడిట్ కార్డ్‌పై (EMI) ద్వారా అదనంగా 10 శాతం డిస్కౌంటుతో చెల్లించవచ్చు. ఈ సేల్ 14 ఏప్రిల్ 2023న ప్రారంభమైంది. ఏప్రిల్ 17, 2023న ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా, అమెజాన్ (AC)లు, కూలర్‌లపై ప్రీమియం డీల్‌లను అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన ఏసీ లేదా కూలర్ ఎంచుకుని కొనేసుకోండి.

LG 1.5 టన్ 5 స్టార్ AI డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC :
అమెజాన్ సేల్ 2023లో భాగంగా.. 1.5 టన్ను 5 స్టార్ LG ACలను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త AC మోడల్స్ 6-in-1 కూలింగ్ మోడ్‌తో వస్తాయి. HD ఫిల్టర్‌ కలిగి ఉన్నాయి. అదనంగా, LG ఎయిర్ కండీషనర్ తక్కువ గ్యాస్ డిటెక్షన్ ఇండికేటర్, స్టెబిలైజర్-ఫ్రీ ఆపరేషన్, 6-ఫ్యాన్ స్పీడ్‌ని కలిగి ఉంటుంది. భారత మార్కెట్లో ఈ AC ధర రూ. 45,490లకు పొందవచ్చు.

Read Also : Flipkart Summer Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.12,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ Wi-Fi ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ AC :
అమెజాన్ సేల్ 2023లో భాగంగా.. పానాసోనిక్ (Panasonic AC) 1.5 టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. AI మోడ్‌తో సహా 7-ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్‌ను కలిగి ఉంది. ఈ 5 స్టార్ AC ట్విన్-కూల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌ను కూడా కలిగి ఉంది. పవర్‌ఫుల్, డ్రై మోడ్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ సమయంలో (Panasonic) ఏసీ ధర రూ. 44,990లకు పొందవచ్చు.

Amazon Blockbuster Value Days Sale 2023 _ Premium deals on AC and coolers

Amazon Blockbuster Value Days Sale 2023 _ Premium deals on AC and coolers

డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC :
అమెజాన్ సేల్ 2023లో భాగంగా.. 1.5 టన్ను 5 స్టార్ డైకిన్ ఏసీలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ACలు 6-in-1 కూలింగ్ మోడ్‌తో వస్తాయి. HD ఫిల్టర్‌లతో అమర్చబడి ఉంటాయి. అదనంగా, డైకిన్ (AC)లో ఇన్వర్టర్ కంప్రెసర్, టర్బో కూలింగ్, 3D ఎయిర్‌ఫ్లో, రిమోట్ కంట్రోల్, డ్యూ క్లీన్ టెక్నాలజీ, ట్రిపుల్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ మాయిశ్చర్ అడ్జెస్ట్, PM 2.5 ఫిల్టర్, డస్ట్ ఫిల్టర్, ఆటో క్లీన్ ఉన్నాయి. ఈ AC ధర రూ. 45,490లకు పొందవచ్చు.

క్రాంప్టన్ ఓజోన్ డెజర్ట్ ఎయిర్ కూలర్ :
అమెజాన్ సేల్ సందర్భంగా 75 లీటర్ల సామర్థ్యంతో క్రాంప్టన్ డెజర్ట్ ఎయిర్ కూలర్‌ను అందిస్తుంది. ఈ ఎయిర్ కూలర్ హై-డెన్సిటీ హనీకాంబ్ ప్యాడ్‌లను కలిగి ఉంది. 4-వే ఎయిర్ డిఫ్లెక్షన్‌ కలిగి ఉంది. ఈ సేల్ సమయంలో కూలర్ ధర రూ. 10,249లకు అందిస్తుంది.

బజాజ్ DMH 90 నియో డెసర్ట్ ఎయిర్ కూలర్ :
ఈ ఎయిర్ కూలర్ రెండేళ్ల వారంటీ, హెక్సాకూల్ మరియు టర్బోఫ్యాన్ టెక్నాలజీ, ఐస్ ఛాంబర్, 90-ఫీట్ ఎయిర్ త్రో 3-స్పీడ్ కంట్రోల్‌తో వస్తుంది. అమెజాన్ సేల్ సమయంలో ధర రూ. 9,949లకు పొందవచ్చు.

Read Also : WhatsApp Video Messages : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. త్వరలో వీడియో మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు..!