Realme GT 6T
Realme GT 6T 5G Sale : రియల్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. మీరు ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. రియల్‌మి GT 6T 5G ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఈ 5జీ ఫోన్ అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్‌తో అందుబాటులో ఉంది.
ఈ డీల్ ద్వారా రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్‌లతో సొంతం చేసుకోవచ్చు. 120W ఛార్జింగ్ సపోర్టు కలిగిన ఈ ఫోన్‌కు మార్కెట్లో కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ప్రస్తుతం రియల్‌మి GT 6T 5జీ ధరలు భారీగా తగ్గాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐ వంటి ఆప్షన్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.
రియల్‌మి జీటీ 6T 5జీపై డిస్కౌంట్ ఆఫర్లు :
రియల్‌మి జీటీ 6T 5జీపై ధర, ఆఫర్ల విషయానికి వస్తే.. 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 35999కు లిస్టు అయింది. అమెజాన్ నుంచి 28శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ తర్వాత మీరు రూ. 25,998కు కొనుగోలు చేయవచ్చు.
బ్యాంక్ డిస్కౌంట్ల విషయానికి వస్తే.. HSBC బ్యాంక్ కార్డులపై రూ. 1500 తగ్గింపు పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్ కార్డులపై రూ. 1750 తగ్గింపు అందిస్తోంది. మీరు రూ. 22,800 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. కండిషన్ అప్లయ్ అవుతాయి. ఈ 5జీ ఫోన్ రూ. 1260 ఈఎంఐ ఆప్షన్‌పై కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి GT 6T 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ ఫోన్ 6.78-అంగుళాల LTPO కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 120Hz సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 2,789 x 1,264 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 డిస్‌ప్లే ప్రొటెక్షన్‌తో లభిస్తుంది. మల్టీ టాస్కింగ్, పర్పార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 50MP, సెకండరీ కెమెరా 8MP, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కలిగి ఉంది. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 5,500mAh పవర్‌ఫుల్ బ్యాటరీని కలిగి ఉంది. 120W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.