Jeff Bezos : రెండో పెళ్లి చేసుకోబోతున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. ఏకంగా రూ.5 వేల కోట్లు ఖర్చు..!
Jeff Bezos : జెఫ్ బెజోస్ డిసెంబర్ 28న కొలరాడోలోని ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Amazon founder Jeff Bezos set to marry Lauren Sanchez
Jeff Bezos : అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని రెండో అత్యంత సంపన్నుడు జెఫ్ బెజోస్ డిసెంబర్ 28న కొలరాడోలోని ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ పెళ్లికి దాదాపు 600 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5వేల కోట్లు) ఖర్చవుతుందని అంచనా. కెవిన్ కాస్ట్నర్ 160 ఎకరాల స్థలాన్ని గ్రాండ్ ఈవెంట్ కోసం ఎంచుకున్నట్లు నివేదిక వెల్లడించింది. ఆస్పెన్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జెఫ్ బెజోస్-లారెన్ శాంచెజ్ పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ జంట పెళ్లిని గత ఏడాదిలోనే ప్రకటించారు. బెజోస్ 20-క్యారెట్ డైమండ్‌తో తయారు చేసిన హార్ట్ షేప్ ఉంగరాన్ని ధరించాడు. ఎమ్మీ అవార్డ్-విజేత జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ లారెన్ శాంచెజ్ బెజోస్‌తో పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.
ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ :
వివాహానికి ముందు, డిసెంబర్ 26, డిసెంబర్ 27 తేదీలలో జరిగే విలాసవంతమైన సుషీ రెస్టారెంట్ మత్సుహిసాలో వేడుక జరుగనుంది. ఈ కార్యక్రమాలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఆగస్ట్ 2023లో ఇటలీలో జరిగిన ఆమె ఎంగేజ్‌మెంట్ పార్టీకి హాజరైన బిల్ గేట్స్, లియోనార్డో డికాప్రియో, క్రిస్ జెన్నర్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.
2005లో శాంచెజ్ వైట్‌సెల్ లారెన్ శాంచెజ్ గతంలో హాలీవుడ్ ఏజెంట్ పాట్రిక్ వైట్‌సెల్‌ను 2005లో వివాహం చేసుకున్నారు. 13ఏళ్ల వివాహం తర్వాత 2019లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇవాన్, ఎల్లా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెజోస్‌తో పెళ్లికి ముందు, లారెన్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్‌గా పనిచేసింది. బ్లాక్ ఆప్స్ ఏవియేషన్‌ను స్థాపించింది.
బెజోస్ పెళ్లిళ్లు :
జెఫ్ బెజోస్ 2019లో విడాకులు తీసుకునే ముందు మెకెంజీ స్కాట్‌ను వివాహం చేసుకున్నారు. 1994లో వివాహం చేసుకున్న ఈ జంటకు ముగ్గురు కుమారులు, దత్తపుత్రిక ఉన్నారు. 25 ఏళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మెకెంజీ స్కాట్ ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. సైన్స్ టీచర్ డాన్ జ్యువెట్‌ను వివాహం చేసుకున్నారు.
బెజోస్ నికర విలువ :
బెజోస్ మొత్తం సంపద రూ.20.26 లక్షల కోట్లు. ఇటీవలే తన సంపదను 66.8 బిలియన్ డాలర్లు పెంచుకున్న ఆయన 2024లో అత్యధికంగా సంపాదిస్తున్న బిలియనీర్‌లలో ఒకరిగా నిలిచారు. అమెజాన్‌తో పాటు, వాషింగ్టన్ పోస్ట్‌ను కలిగి ఉన్నాడు. సబ్-ఆర్బిటల్ స్పేస్‌ఫ్లైట్ సర్వీస్ బ్లూ ఆరిజిన్‌ను స్థాపించాడు.
Read Also : Congo Ferry Capsize : కాంగోలో ఘోర ప్రమాదం.. నదిలో బోల్తా పడి 38 మంది దుర్మరణం, 100 మందికి పైగా గల్లంతు!