Telugu » Business » Amazon Great Indian Festival 2025 Sale Major Discount On Iphone 15 Samsung S24 Ultra Oneplus Laptops Sh
Amazon Great Indian Festival Sale : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 15, శాంసంగ్ S24 అల్ట్రా, వన్‌ప్లస్, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!
Amazon Great Indian Festival 2025 : అమెజాన్ ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వన్ ప్లస్, ల్యాప్ టాప్స్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది.
Amazon Great Indian Festival 2025 Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్ టాప్ కొనేందుకు చూస్తున్నారా? సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 24 గంటల ముందస్తు యాక్సెస్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. రిటైలర్లు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఆడియో సిస్టమ్‌లు, అప్లియన్సెస్‌పై భారీ తగ్గింపులను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15 నుంచి బడ్జెట్-ఫ్రెండ్లీ రెడ్‌మి, రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ల (Amazon Great Indian Festival 2025 Sale) వరకు అలాగే HP, ASUS నుంచి ప్రీమియం ల్యాప్‌టాప్‌ల వరకు ఈ సేల్ అందరికి అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ కార్డులు, అమెజాన్ పే ఆఫర్‌ల ద్వారా అదనపు సేవింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్ సభ్యులకు సేల్ తేదీలు, అడ్వాన్స్ యాక్సెస్ :
సెప్టెంబర్ 23న ప్రారంభమయ్యే అధికారిక సేల్‌కు ముందు ప్రైమ్ మెంబర్లకు ముందస్తు యాక్సెస్ పొందవచ్చు. సెప్టెంబర్ 22న 24 గంటల ముందస్తు యాక్సెస్ ద్వారా ఆఫర్లపై అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అధికారిక సేల్ అందరికీ అందుబాటులోకి వచ్చాక స్టాక్ రిలీజ్ ముందు కస్టమర్లు బెస్ట్ ఆఫర్లను పొందే అవకాశం ఉంటుంది.
ఈ సేల్‌లో స్పెషల్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ కస్టమర్‌లు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై స్పీడ్ డెలివరీ, అన్ లిమిటెడ్ 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లపై అతిపెద్ద ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G : 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో రూ.71,999 నుంచి ప్రారంభం
ఐఫోన్ 15 : రూ.1,750 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.45,249 నుంచి ప్రారంభం
వన్‌ప్లస్13R : రూ. 35,999కు లభిస్తుంది. రూ. 2వేలు తగ్గింపు, 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్