Oppo Reno 13 Price Drop
Oppo Reno 13 Price Drop : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? పండుగ షాపింగ్ సీజన్ మొదలైంది. ఈరోజు (సెప్టెంబర్ 23) నుంచి అధికారికంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ప్రారంభమైంది. ఈ సేల సందర్భంగా అమెజాన్ అనేక అద్భుతమైన డీల్‌లను అందిస్తోంది.
ఈ సేల్ సమయంలో ఒప్పో రెనో 13 భారీ తగ్గింపు ధరకే (Oppo Reno 13 Price Drop) లభిస్తోంది. ఈ ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం.. ఇంతకీ ఈ ఒప్పో రెనో 13 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో ఒప్పో రెనో 13 ధర తగ్గింపు :
ఈ ఏడాది ప్రారంభంలో ఒప్పో రెనో 13 ధర రూ.37,999కి లాంచ్ అయింది. అయితే, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం రూ.26,999కి అందుబాటులో ఉంది. తద్వారా రూ.11వేలు నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ డీల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు మరింత మెరుగ్గా ఉంటుంది. అదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. ధర రూ.25,999కి తగ్గుతుంది. లేటెస్ట్ ఒప్పో రెనో ఫోన్ కొనుగోలుపై మొత్తం రూ.12వేలు సేవ్ చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో అతిపెద్ద డిస్కౌంట్లలో ఇదొకటిగా చెప్పొచ్చు.
ఒప్పో రెనో 13 స్పెసిఫికేషన్లు :
ఒప్పో రెనో 13 ఫోన్ 6.59-అంగుళాల డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. హుడ్ కింద, ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ (4nm)పై రన్ అవుతుంది. 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ColorOS 15తో వస్తుంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉంది.
పవర్ పరంగా ఒప్పో రెనో 13 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,600mAh బ్యాటరీ కలిగి ఉంది. ఆకట్టుకునే IP66, IP68, IP69 రేటింగ్ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. 50MP ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్, 2MP మోనోక్రోమ్ సెన్సార్ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ హై-రిజల్యూషన్ 50MP సెల్ఫీ షూటర్ కూడా ఉంది.