Jio Recharge Plan : జియో యూజర్లకు పండగే.. జస్ట్ రూ. 77తో ఎక్స్‌ట్రా డేటా, ఫ్రీగా OTT సబ్‌స్క్రిప్షన్.. నెల రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!
Jio Recharge Plan : జియో కొత్త రూ.77 ప్లాన్ ప్రవేశపెట్టింది. 5 రోజుల వ్యాలిడిటీ, 3GB డేటా, OTT ప్లాట్‌ఫామ్‌కు 30 రోజులు ఫ్రీగా పొందొచ్చు.

Jio Recharge Plan
Jio Recharge Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. టెలికం రంగంలో జియో నెంబర్‌వన్‌గా దూసుకుపోతోంది. ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాకు పోటీగా జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్లతో యూజర్లను ఆకర్షిస్తోంది. ఇప్పుడు జియో యూజర్ల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది.
అదే.. జియో రూ. 77 ప్లాన్. ఈ ప్లాన్ ఇతర (Jio Recharge Plan) డేటా బెనిఫిట్స్‌తో పాటు పాపులర్ OTT సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. ఈ జియో ప్లాన్ కేవలం అదనపు డేటా రీఛార్జ్, OTT యాప్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది.
జియో రూ.77 ప్లాన్ బెనిఫిట్స్ ఇవే :
జియో రూ.77 ప్లాన్ మొత్తం 5 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మీ ప్లాన్ కన్నా 3GB అదనపు డేటాను అందిస్తుంది. ఇంకా ఏమిటంటే.. 30 రోజుల పాటు SonyLIV సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులందరూ Google Play Store, Apple App Store రెండింటిలోనూ JioTV అప్లికేషన్ ద్వారా SonyLIV కంటెంట్‌ను యాక్సస్ చేయొచ్చు.
ఈ ప్లాన్ ప్రధాన USP నెలవారీ SonyLIV సబ్‌స్క్రిప్షన్. ఈ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ మార్కెట్లో రూ. 399కు అందుబాటులో ఉంది. మొబైల్-ఓన్లీ సర్వీస్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదికి రూ. 699 చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పుడు, ఈ రెండింటినీ కంపేర్ చేస్తే.. మొబైల్-ఓన్లీ సబ్‌స్క్రిప్షన్ బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఏదైనా చూసేందుకు మాత్రమే సబ్‌స్క్రయిబ్ కావాలంటే అదనపు డేటాను అందించే జియో ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
SonyLIVలో కంటెంట్ విషయానికొస్తే.. ఈ యాప్‌లో మెయిన్ స్పోర్ట్స్ టోర్నమెంట్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వెబ్ సిరీస్, టీవీ షోల వరకు భారీ లైబ్రరీ ఉంది. మీరు యాప్‌లో అన్నింటిని ఒకేచోట వీక్షించవచ్చు.