Amazon Great Indian Festival Sale : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ వన్‌ప్లస్ 13s అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Amazon Great Indian Festival Sale : వన్‌ప్లస్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన డిస్కౌంట్.. రాబోయే అమెజాన్ సేల్ సమయంలో ఈ వన్‌ప్లస్ 13s ఫోన్ భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు.

1/6OnePlus 13s
Amazon Great Indian Festival Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అదిరిపోయే న్యూస్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 23న ఈ అమెజాన్ బిగ్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ ఈవెంట్ స్మార్ట్‌ఫోన్‌లతో సహా అన్ని గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్‌కు ముందే అమెజాన్ అనేక స్మార్ట్‌ఫోన్ డీల్స్ వెల్లడించింది.
2/6OnePlus 13s Price
ఈ డీల్స్‌లో వన్‌ప్లస్ 13s ఫోన్ ఒకటి. ఈ కాంపాక్ట్ ఫోన్ తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. అయితే, స్పీడ్, బ్యాటరీ లైఫ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో వన్‌ప్లస్ 13s ఫోన్ అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో కేవలం రూ. 48వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
3/6OnePlus 13s Sale
వన్‌ప్లస్ 13s అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13s రూ.54,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఈ కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ రూ.47,999 ధరకు అందుబాటులో ఉంటుంది.
4/6OnePlus 13s Specifications
వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వన్‌ప్లస్ 13s ఫోన్ 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 460ppiతో 6.32-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR10+, HDR వివిడ్ సపోర్ట్‌తో 1,600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
5/6OnePlus 13s Price discount
ఈ కాంపాక్ట్ ఫోన్ 12GB LPDDR5X, 256GB/512GB UFS 4.0తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఇంకా, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,850mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13sలో 50MP సోనీ ఎల్‌వైటీ-700 OISతో 50MP (2X ఆప్టికల్ జూమ్) టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
6/6OnePlus 13s
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది. వన్‌ప్లస్ 13s ఇతర ముఖ్యమైన ఫీచర్లలో Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, డ్యూయల్-సిమ్, USB టైప్-C, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్, ఐఆర్ రిమోట్, గైరోస్కోప్, ఇ-కంపాస్ ఉన్నాయి.