Amazon Great Summer Sale
Amazon Great Summer Sale 2025 : స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 ప్రకటించింది. మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకున్నా లేదా కొత్త ల్యాప్‌టాప్ కొనాలన్నా ఇదే సరైన సమయం.
ఈ సేల్ వైడ్ రేంజ్ ప్రొడక్టులపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ నుంచి హోం, కిచెన్ అప్లియన్సెస్ వరకు, గ్రేట్ సమ్మర్ సేల్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రానుంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025లో ఏయే ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నాయో మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 తేదీ, సమయం :
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 1, 2025న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగే, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 30 అర్ధరాత్రి నుంచి కొనుగోలుదారులు అన్ని డీల్‌లను యాక్సెస్ చేయవచ్చు. అమెజాన్ ఇంకా సేల్ ఎండ్ తేదీని వెల్లడించనప్పటికీ, బెస్ట్ డీల్స్ పొందాలంటే ముందుగా కొనుగోలు చేయడమే బెటర్.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 డీల్స్ :
అమెజాన్ ఈ సేల్ సమయంలో డిస్కౌంట్‌లో లభించే కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15, ఐక్యూ నియో 10R, వన్‌ప్లస్ 13R, వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్, వన్‌ప్లస్ నార్డ్ 4, శాంసంగ్ గెలాక్సీ M35 5G, ఐక్యూ Z10x ఫోన్లు ఉన్నాయి. ల్యాప్‌టాప్ కొనుగోలుదారులు HP, Lenovo, Asus వంటి బ్రాండ్‌లపై డీల్స్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర అప్లియన్సెస్‌పై కూడా డిస్కౌంట్లు ఉంటాయి.
మీరు HDFC బ్యాంక్ కస్టమర్ అయితే.. మరిన్ని ఆఫర్లను పొందవచ్చు. ఈ సేల్ సమయంలో క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇతర వస్తువులతో పాటు, TWS ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర అప్లియన్సెస్ డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది. అమెజాన్ త్వరలో మరిన్ని ఆఫర్‌లను వెల్లడిస్తుందని భావిస్తున్నారు.