Pakistani Man : మా ఇద్దరు పిల్లల ప్రాణాలు మీ చేతిలోనే.. పాక్‌లోని హైదరాబాద్ నుంచి ట్రీట్‌మెంట్ కోసం ఇండియాకి వచ్చిన ఓ తండ్రి కథ..!

Pakistani Man : మా ఇద్దరు పిల్లలు ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి.. వారికి ట్రీట్‌మెంట్ చాలా అవసరం.. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చికిత్స కోసం ఇంతదూరం వచ్చాం.. పిల్లల ఆపరేషన్ అయ్యేవరకు ఉండనివ్వండని పాకిస్తానీ తండ్రి కన్నీంటి పర్యంతమయ్యాడు.

Pakistani Man : మా ఇద్దరు పిల్లల ప్రాణాలు మీ చేతిలోనే.. పాక్‌లోని హైదరాబాద్ నుంచి ట్రీట్‌మెంట్ కోసం ఇండియాకి వచ్చిన ఓ తండ్రి కథ..!

Pakistani Man

Updated On : April 26, 2025 / 12:00 PM IST

Pakistani Man : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌లోని పాకిస్తానీయులకు క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాక్ వీసాలను కూడా రద్దు చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఎటు వెళ్లాలో తెలియదు.. ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వాఘా సరిహద్దు ద్వారా భారతీయులు స్వదేశానికి తిరిగి చేరుకోగా అనేక మంది పాకిస్తానీయులు కూడా భారత్ నుంచి తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు.

Read Also : Anant Ambani : ‘రిల్’ ఎగ్గిక్యూటివ్ డైరెక్టర్‌గా అనంత్ అంబానీ.. మే 1 నుంచి ఐదేళ్లకు నియమాకం..!

అయితే, పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల సార్క్ వీసా రద్దు చేయడంతో ప్రభావితమైన వారిలో సింధ్‌లోని హైదరాబాద్‌కు చెందిన కుటుంబం కూడా ఉంది. తమ వీసా రద్దు కావడంతో ఆ కుటుంబం భారత్‌లోనే ఉండిపోయింది. ఇటీవల ఇద్దరు పిల్లల ట్రీట్‌మెంట్ కోసం ఈ కుటుంబం భారత్‌కు వచ్చింది. ఇప్పుడు ఆ పిల్లల తండ్రి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ట్రీట్ మెంట్ అయ్యేవరకు ఉండనివ్వండి : తండ్రి ఆవేదన 
ఇద్దరు పిల్లలకు ఢిల్లీలో ట్రీట్‌మెంట్ చేయించుకోవాల్సింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక ఆ పాకిస్తానీ తండ్రి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన పిల్లలు గుండె జబ్బులతో బాధపడుతున్నారని, పిల్లల చికిత్స కోసం తనను ఇక్కడే ఉండనివ్వండని వేడుకుంటున్నాడు. తన పిల్లలకు వచ్చే వారం ఆపరేషన్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు పాకిస్తానీ వ్యక్తి. తమను స్వదేశానికి తిరిగి పంపే ముందు పిల్లల చికిత్స పూర్తి అయ్యేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు.

పాకిస్తానీ తండ్రి జియో న్యూస్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. 9 ఏళ్లు, 7 ఏళ్లు వయస్సు గల తన పిల్లలు పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్నారని వాపోయాడు. ప్రస్తుతం ఢిల్లీలో పిల్లలు చికిత్స పొందుతున్నారు. కానీ,  తనను వెంటనే పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లిపోవాలని కోరారు. తన పిల్లలకు సర్జరీ వచ్చే వారం జరగనుందని తండ్రి చెబుతున్నాడు.

ఆస్పత్రి, వైద్యులు తమకు సహకరిస్తున్నారని అయితే, పోలీసులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ వారిని వెంటనే ఢిల్లీ విడిచి వెళ్లాలని కోరాయని తెలిపాడు. “నా పిల్లల చికిత్సను పూర్తి అయ్యేవరకు అనుమతించాలని నేను భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మా ప్రయాణం, బస, వారి చికిత్స కోసం మేం దాదాపు రూ. 10 మిలియన్లు ఖర్చు చేసాం” అని ఆ వ్యక్తి నివేదికలో పేర్కొన్నాడు.

పాక్ నుంచి 100మందికి పైగా భారతీయులు.. 
ఇదిలా ఉండగా, పాకిస్తాన్ నుంచి 100 మందికి పైగా భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారని పీటీఐ తెలిపింది. భారత్‌లో నివసిస్తున్న 28 మంది పాకిస్తానీయులు తిరిగి వచ్చారని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పినట్లు నివేదిక తెలిపింది. భారత పౌరులు లాహోర్ సమీపంలోని వాఘా సరిహద్దు ద్వారా తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. చాలా మంది పాకిస్తానీయులు కూడా భారత్ నుంచి తిరిగి వచ్చారు.

అట్టారి-వాఘా క్రాసింగ్ భారత్‌లోని అమృత్సర్‌ను పాకిస్తాన్‌లోని లాహోర్‌తో కలుపుతుంది. సరిహద్దు వద్ద బలూచిస్తాన్ నుంచి భారత్‌లో వివాహానికి వచ్చిన ఏడుగురు సభ్యుల పాకిస్తానీ హిందూ కుటుంబం కూడా ఉంది. వాఘా చేరుకున్న తర్వాత భారత ప్రభుత్వం తన వీసాను రద్దు చేసిందని అధికారులు చెప్పారని తెలిపారు. తాము బలూచిస్తాన్ నుంచి లాహోర్‌కు వెళ్తున్నామని ఆ విషయం తమకు తెలియదని అన్నారు.

పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఇందులో 26 మంది మరణించారు. ఇందులో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. 2019 పుల్వామా దాడి తర్వాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది.

Read Also : Anti-Naxal Operation : కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కాగర్’.. హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వేతో మావోయిస్టుల ఏరివేత..!

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది. ఆ తర్వాత న్యూఢిల్లీలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశమై అట్టారిలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను వెంటనే మూసివేయాలని ఆదేశించింది.