Anant Ambani : ‘రిల్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అనంత్ అంబానీ.. మే 1 నుంచి ఐదేళ్లకు నియమాకం..!
Anant Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనంత్ అంబానీని కంపెనీకి ఫుల్ టైమ్ డైరెక్టర్‌గా నియమించింది. మే 1, 2025 నుంచి ఐదు సంవత్సరాల కాలానికి అనంత్ అంబానీ నియామకాన్ని బోర్డు ఆమోదించింది.

Anant Ambani
Anant Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( RIL) బోర్డు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అనంత్ అంబానీని నియమించింది. ఈ నియామకంతో 5 ఏళ్ల పాటు కంపెనీకి అనంత్ అంబానీ ఎగ్గిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. హ్యుమన్ రీసోర్సెస్, నామినేషన్, వేతన కమిటీ సిఫార్సు మేరకు, మే 1, 2025 నుంచి 5 సంవత్సరాల కాలానికి అనంత్ అంబానీ నియామకాన్ని బోర్డు ఆమోదించింది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు వెల్లడించింది.
Read Also : Veeraiah Chowdary : టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పురోగతి.. స్కూటీ స్వాధీనం..!
ప్రస్తుతం అనంత్ అంబానీ కంపెనీలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. క్లీన్ ఫ్యూయల్స్, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ, రీసైక్లింగ్, క్రూడ్-టు-కెమికల్స్ వంటి వినూత్న ప్రాజెక్టులతో 2035 నాటికి నికర జీరో కార్బన్ కంపెనీగా మారాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
అనంత్ అంబానీ అనేక రిలయన్స్ గ్రూప్ కంపెనీల బోర్డులలో కూడా పనిచేస్తున్నారు. మార్చి 2020 నుంచి జియో ప్లాట్‌ఫారమ్‌లు, మే 2022 నుంచి రిలయన్స్ రిటైల్ వెంచర్స్, జూన్ 2021 నుంచి రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ ఉన్నాయి. సెప్టెంబర్ 2022 నుంచి రిలయన్స్ ఫౌండేషన్ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు.
అనంత్ అంబానీ జంతు ప్రేమికుడు. అమెరికన్ బ్రౌన్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. జంతు సంక్షేమం పట్ల మక్కువ కలిగి ఉంటారు. ప్రమాదంలో ఉన్న జంతువులకు పునరావాసం కల్పించడం, వాటి చివరి సంవత్సరాల్లో సంరక్షణ, ప్రేమను అందించడంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
Read Also : CM Chandrababu : శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఫుల్ షెడ్యూల్ వివరాలివే..!
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించిన అంబానీ కుటుంబంలో అనంత్ మొదటి వ్యక్తి. అయితే, ఆయన సోదరుడు ఆకాష్ అంబానీ 2022 నుంచి జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్‌గా ఉన్నారు. అనంత్ అంబానీ సోదరి ఇషా అంబానీ కూడా పిరమల్ రిలయన్స్ రిటైల్ వ్యాపారానికి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు.