Anti-Naxal Operation : కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కాగర్’.. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వేతో మావోయిస్టుల ఏరివేత..!
Anti-Naxal operation : ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కొండ ప్రాంతంలో సుమారు 10వేల మంది భద్రతా సిబ్బందితో మావోయిస్టులపై చేపట్టిన భారీ ఆపరేషన్ ఐదవ రోజుకు చేరుకుంది.

Anti-Naxal operation
Anti-Naxal Operation : దండకారణ్యం దద్దరిల్లుతోంది. తెలంగాణ చత్తీస్‌గఢ్ సరిహద్దులో కర్రెగుట్టల దండకారణ్యం తుపాకీ గుళ్ల వర్షం, బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని కర్రిగుట్టలపై మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ‘ఆపరేషన్ కాగర్’లో భాగంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఐదవ రోజుకి కూంబింగ్ చేరుకుంది.
మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ కీలక నేతలు హిడ్మా, దేవ టార్గెట్‌గా కర్రెగుట్టలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మావోయిస్టులు, జవాన్లు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వైమానిక దాడులతో పాటు శాటిలైట్ మ్యాప్‌తో మావోయిస్టుల స్థావరాలను గుర్తించనున్నారు. కర్రెగుట్టపై సుమారు 30 కిలోమీటర్ల మేర బలగాలు చేరుకున్నాయి. 8 హెలికాప్టర్ల ద్వారా జవాన్లకి ఆయుధాలు, భోజనాలు, నీళ్ళు సరఫరా చేస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రాంతాల్లో గుట్ట సమీప గ్రామ ప్రజలు బయటికి రావద్దని పోలీసులు ఆంక్షలు విధించారు.
అక్కడి గిరిజనులు భయాందోళన గురవుతున్నారు. రాత్రి, పగలు డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కోసం ఏజెన్సీని బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందని తెలియని పరిస్థితి నెలకొంది. హెలిక్యాప్టర్ ద్వారా ఏరియల్ సర్వేతో పాటు సమాచారంపై గోప్యత పాటిస్తున్నారు.
మావోయిస్టులపై దాడులు నిలిపివేయాలి : నిరసన ర్యాలీలు :
మూడు రాష్ట్రాల నుంచి 20 వేల మంది బలగాలు మోహరించగా, ఎంత మందినైనా రంగంలోకి దింపేందుకు భద్రతా బలగాలు సిద్దం గా ఉన్నట్టు తెలుస్తోంది. శాంతి చర్చల లేఖలను పంపినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మావోయిస్టులపై కాల్పులు నిలుపుదల చేయాలని నిరసన ర్యాలీలు కూడా చేపట్టారు.
Read Also : Veeraiah Chowdary : టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పురోగతి.. స్కూటీ స్వాధీనం..!
కర్రె గుట్టలపై కేంద్ర బలగాల దాడులు నిలిపి వేయాలని, బలగాలను వెనక్కి పిలవాలని మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి పాత బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు.