Honor 200 Discount : అమెజాన్ బంపర్ ఆఫర్.. హానర్ 200 ఫోన్‌పై ఏకంగా రూ. 20వేలు డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Honor 200 Discount : హానర్ 200 ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్.. అమెజాన్ రూ. 20వేల తగ్గింపుతో హానర్ 200 ఫోన్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Honor 200
Honor 200 Discount : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మంచి కెమెరా ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం చూస్తున్నారా? అది కూడా తక్కువ బడ్జెట్‌లోనే.. అయితే మీకోసం అద్భుతమైన ఫోన్ అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవలే హానర్ 200 స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది.
Read Also : Nothing Phone 2 : ఆఫర్ అదుర్స్.. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ డోంట్ మిస్..!
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఆకర్షణీయంగా ఉంది. 50MP మెయిన్ కెమెరాతో పాటు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ప్రస్తుతం, అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 12వేలు తగ్గింపును అందిస్తోంది.
హానర్ 200 డిస్కౌంట్ :
భారత మార్కెట్లో హానర్ 200 ఫోన్ లాంచ్ అయింది. లాంచ్ సమయంలో 8GB+256GB వేరియంట్ ధర రూ.34,999గా ఉంది. ప్రస్తుతం, అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.22,998కి ఆఫర్ చేస్తోంది.
హానర్ 200 కొనుగోలుపై రూ.12వేలు సేవ్ చేసుకోవచ్చు. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ.21,100 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై రూ.8వేలు డిస్కౌంట్ పొందితే.. హానర్ 200 ఫోన్ రూ.15వేల కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. అయితే, కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
హానర్ 200 స్పెసిఫికేషన్లు :
హానర్ 200 ఫోన్ అద్భుతమైన 6.7-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. 4000 నిట్స్ ఆకట్టుకునే HDR పీక్ బ్రైట్‌నెస్‌ను అందుకుంది.
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB లేదా 12GB ర్యామ్ ఆప్షన్లు, 256GB లేదా 512GB ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఆకట్టుకునే బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS, Sony IMX906)తో 50MP ప్రైమరీ సెన్సార్, 2.5x ఆప్టికల్ జూమ్ (Sony IMX856)తో 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి.
Read Also : iPhone 16 Pro : ఐఫోన్ 16ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఇలా చేస్తే తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు..!
సెల్ఫీ ప్రియుల కోసం హై-రిజల్యూషన్ 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. హానర్ 200 ఫోన్ 5200mAh బ్యాటరీతో ఫాస్ట్ 100W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారిత MagicOS 8.0పై రన్ అవుతుంది.