Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ల నుంచి వన్‌ప్లస్ ఫోన్ల వరకు బిగ్ డిస్కౌంట్లు.. ఈ అద్భుతమైన డీల్స్ మీకోసమే..!

Amazon Prime Day Sale : త్వరలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 16e, ఐఫోన్ 15, శాంసంగ్ S24 అల్ట్రా, వన్‌ప్లస్ 13పై బిగ్ డిస్కౌంట్లు ఇవే..

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ల నుంచి వన్‌ప్లస్ ఫోన్ల వరకు బిగ్ డిస్కౌంట్లు.. ఈ అద్భుతమైన డీల్స్ మీకోసమే..!

Amazon Prime Day Sale

Updated On : July 9, 2025 / 5:17 PM IST

Amazon Prime Day Sale 2025 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈవెంట్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ బిగ్ సేల్‌కు ముందు ఈ-కామర్స్ దిగ్గజం ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై (Amazon Prime Day Sale) అద్భుతమైన డీల్స్ వెల్లడించింది. అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16e రూ. 10వేల వరకు డిస్కౌంట్ ఆఫర్‌ను అందుకోనుంది.

ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వన్‌ప్లస్ 13s, వన్‌ప్లస్ 13R, iQOO నియో 10R వంటి ఇతర స్మార్ట్‌ఫోన్‌లు కూడా జూలై 12 నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్‌లతో అందుబాటులో ఉంటాయి. మీరు ఈ ఫోన్‌లలో ఏదైనా కొనాలని ప్లాన్ చేస్తుంటే.. అమెజాన్ 40 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు.

పలు స్మార్ట్‌ఫోన్లపై రూ. 10వేల వరకు డిస్కౌంట్ ఆఫర్లు :
అమెజాన్ ప్రైమ్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. అమెజాన్ పలు స్మార్ట్ ఫోన్ మోడళ్లపై రూ.10వేల వరకు తగ్గింపు అందిస్తోంది. బ్యాంక్, ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్లతో ఐఫోన్ 16e ధర రూ.49,999కు అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో ఈ ఐఫోన్ రూ.59,999కు లాంచ్ అయింది.

అదేవిధంగా, ఐఫోన్ 15 కూడా భారీ తగ్గింపును పొందనుంది. ఈ ఐఫోన్ 15 ధర రూ.57,249కు లభించనుంది. ప్రస్తుత ఐఫోన్ అధికారిక రిటైల్ ధర రూ.69,900కు లభించనుంది. మొత్తంగా రూ.12,651 వరకు డిస్కౌంట్ ఆఫర్‌ పొందవచ్చు.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా వంటి ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు కూడా చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ లాంచ్ ధర రూ.1,29,999 నుంచి రూ.74,999కే లభించనుంది.

Read Also : Oppo Reno 12 Price : ఇది కదా ఆఫర్.. రూ. 33వేల ఒప్పో రెనో 12 ఫోన్ ధర జస్ట్ రూ. 19,999 మాత్రమే.. ఇంకా తగ్గాలంటే?

వప్‌ప్లస్ 13 ఫోన్‌పై రూ. 10వేలు డిస్కౌంంట్ :
భారత మార్కెట్లో రూ.69,999కి లాంచ్ అయిన వప్‌ప్లస్ 13 ఫోన్ ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేకుండా రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ పొందవచ్చు.. కొన్ని బ్యాంక్ కార్డులపై అదనంగా రూ.5,000 తగ్గింపు కూడా పొందవచ్చు. వప్‌ప్లస్ 13 ఫోన్ ధర రూ.59,999కి తగ్గుతుంది. మొత్తం డిస్కౌంట్ రూ.10వేలు పొందవచ్చు.

వన్‌ప్లస్ 13sపై రూ. 5వేలు తగ్గింపు లభిస్తుంది. కొన్ని బ్యాంక్ కార్డులతో ఇంకా తక్కువ ధరకే పొందవచ్చు. ఎందుకంటే.. వన్‌ప్లస్ ఫోన్ ధర రూ. 50వేల కన్నా తక్కువకే లభిస్తుంది. ఐక్యూ నియో 10R వంటి మిడ్-రేంజ్ ఫోన్‌ రూ. 23,499 ధరకు అందిస్తుంది. వన్‌ప్లస్ 13R ఫోన్ కూడా రూ. 39,999కు ధర కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ లాంచ్ ధర రూ. 42,999గా ఉండగా, అమెజాన్ సేల్ సమయంలో తగ్గింపు ధరకే లభించనుంది.

అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ ధర రూ. 15,999 ధరకు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ వెర్షన్ రూ. 19,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం తగ్గింపు ధరకే లభిస్తోంది. రియల్‌మి నార్జో Narzo 80 ప్రో, లావా స్ట్రోమ్ ప్లే, రెడ్‌మి A4, ఐక్యూ Z10x, శాంసంగ్ గెలాక్సీ A55 వంటి ఇతర స్మార్ట్‌ఫోన్‌లు కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉండనున్నాయి.