అంబానీ మీడియా ఆస్తుల అమ్మకం

బిలియనీర్ ముఖేశ్ అంబానీ మీడియా ఆస్తులు అమ్మకానికి పెట్టారు. ఆసియాలోనే అత్యధిక ధనవంతుడైన ఈయన తన కంపెనీ నష్టాల్లోకి పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారట. టైమ్స్ ఆఫ్ గ్రూప్ సంస్థకు నెట్‌వర్క్18 మీడియా & ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ ఆస్తులు అమ్మనున్నట్లు బెన్నెట్ కాలమ్ అనే ఇంగ్లీష్ మీడియా ప్రచురించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపుకు చెందిన నెట్‌వర్క్18 ఈ వార్తలపై ప్రతిఘటించలేదు. ఇటీవల జపనీస్ జెయింట్ చేసిన సర్వేలో ఇండియా మీడియా కంపెనీ అయిన నెట్‌వర్క్18 గతేడాది ఆర్థిక సంవత్సరంలో 1.78బిలియన్ రూపాయల వరకూ నష్టపోయిందట. మొత్తంగా 28బిలియన్ రూపాయలు నష్టపోయిందని సమాచారం.
రెవెన్యూ సంపాదించే దిశగా అడుగులేస్తున్న అంబానీ ఆయిల్ టు పెట్రోకెమికల్స్‌లోనే కొత్త వెంచర్లు వేస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో ఎంటర్‌టైన్మెంట్ కోసం 50బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఈ క్రమంలోనే 2014లో 56ఛానెళ్లను సొంతం చేసుకుంది. మనో కంట్రోల్, న్యూస్ 18, సీఎన్బీసీటీవీ18.కామ్, క్రికెట్ నెక్స్, ఫస్ట్ పోస్ట్ వంటివన్నీ అందులోనివే.