Apple gets new iPhone 14 supplier in India
New iPhone 14 : ఆపిల్ తైవాన్ కాంట్రాక్ట్ తయారీదారు పెగాట్రాన్ కార్ప్ భారత మార్కెట్లో ఐఫోన్ 14 ను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. పెగాట్రాన్ ఆపిల్ రెండో కొత్త ఐఫోన్ 14 సరఫరాదారుగా వచ్చింది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ప్రకారం.. భారత్‌లో ఐఫోన్ 14ను తయారు చేసిన రెండవ ఆపిల్ సరఫరాదారుగా పెగాట్రాన్‌ను పనిచేస్తుందని నివేదిక తెలిపింది. అయినప్పటికీ, తయారీ ప్రణాళిక ఇంకా వెల్లడించలేదు. చైనా జీరో-కోవిడ్ విధానం కారణంగా చైనాలోని ఆపిల్ ఫాక్స్‌కాన్ ప్లాంట్ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫాక్స్‌కాన్ ప్లాంట్ చైనాలోని జెంగ్‌జౌ నగరంలో ఉంది.
ఆపిల్, పెగాట్రాన్ ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. భారత్‌లో Apple పెగాట్రాన్ సౌకర్యం తమిళనాడులో ఉంది. ఆపిల్ ప్రస్తుతం భారత్‌లో విస్ట్రాన్, పెగాట్రాన్, ఫాక్స్‌కాన్‌తో సహా ముగ్గురు సరఫరాదారులను కలిగి ఉంది. విస్ట్రాన్ ప్లాంట్ బెంగళూరులో ఉంది. Apple ప్రస్తుతం భారతదేశంలో iPhone SE, iPhone 12, iPhone 13, iPhone 14 మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది.
Apple gets new iPhone 14 supplier in India
భారత్‌లో విక్రయిస్తున్న ప్రో మోడల్స్ అన్నీ దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. Apple పెగాట్రాన్ సౌకర్యం సెప్టెంబర్‌లో 7,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించింది. నివేదికల ప్రకారం.. ఇది ఈ ఏడాది ప్రారంభంలో ఐఫోన్ 12 హ్యాండ్‌సెట్‌లను తయారు చేయడం ప్రారంభించింది.
వాషింగ్టన్, బీజింగ్ మధ్య కొనసాగుతున్నవాణిజ్య యుద్ధం కారణంగా ఆపిల్ చైనా నుంచి ఉత్పత్తి కేంద్రాలను మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, చైనా నుంచి ఉత్పత్తిని మార్చడం అంత సులభం కాకపోవడానికి ఒక కారణం ఉంది. ఏమిటంటే, ఐఫోన్ పార్టులలో ఎక్కువ భాగం దేశంలోనే ఉన్నాయని సీనియర్ విశ్లేషకుడు ఇవాన్ లామ్ చెప్పారు. ఆపిల్ ఉత్పత్తిని చైనా నుంచి తరలించినట్లయితే.. డివైజ్‌లను ఎక్కడ అసెంబుల్ చేసినా స్పేర్ పార్టులను రవాణా చేయాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..