iPhone 14 Users : మీరు ఐఫోన్ 14 వాడుతున్నారా? SIM కార్డులో బగ్ సమస్యలు.. వెంటనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోండి!

iPhone 14 Users : మీరు ఐఫోన్ 14 వాడుతున్నారా? అయితే చాలామంది ఐఫోన్ 14 వినియోగదారులు SIM కార్డు బగ్ సమస్యలను ఎదుర్కొన్నారు. కొంతమంది ఐఫోన్ యూజర్లు బగ్ కారణంగా సిమ్ కార్డ్ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆపిల్ వెల్లడించింది.

iPhone 14 Users : మీరు ఐఫోన్ 14 వాడుతున్నారా? SIM కార్డులో బగ్ సమస్యలు.. వెంటనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోండి!

Some iPhone 14 users facing SIM card issues, Apple says its investigating bug

iPhone 14 Users : మీరు ఐఫోన్ 14 వాడుతున్నారా? అయితే చాలామంది ఐఫోన్ 14 వినియోగదారులు SIM కార్డు బగ్ సమస్యలను ఎదుర్కొన్నారు. కొంతమంది ఐఫోన్ యూజర్లు బగ్ కారణంగా సిమ్ కార్డ్ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆపిల్ వెల్లడించింది. MacRumors నివేదించినట్లుగా.. ‌iPhone 14‌, ‌iPhone 14‌ Plus, iPhone 14 Pro, ‌iPhone 14 Pro‌ Max యూజర్లు SIM పోర్ట్ చేయని మెసేజ్ కనిపిస్తుంది. ఈ పాప్-అప్ తర్వాత ఐఫోన్ పూర్తిగా పనిచేయకుండా ఆగిపోయే అవకాశం ఉంది.

ఆపిల్‌ కంపెనీ ఈ సమస్యపై పరీక్షిస్తోందని పేర్కొంది. హార్డ్‌వేర్ సమస్య కాదని కంపెనీ స్పష్టం చేసింది. యూజర్లు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలంటూ మెమో జారీ చేసింది. ఐఫోన్ 14 యూజర్లు ఆ బగ్ మెసేజ్ అదృశ్యమవుతుందో లేదో చూసేందుకు కొన్ని నిమిషాలు వేచి ఉండాలని MacRumours పేర్కొంది.

Some iPhone 14 users facing SIM card issues, Apple says its investigating bug

Some iPhone 14 users facing SIM card issues, Apple says its investigating bug

Apple ఇంకా ఆ బగ్ సమస్యను పరిష్కరించలేదు. అలా చేయకపోతే, కస్టమర్‌లు డివైజ్ రీసార్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. లేకపోతే, యూజర్లు SIM కార్డ్ లేకుండా స్మార్ట్‌ఫోన్‌ను సెటప్ చేసేందుకు ట్రై చేయవచ్చు. పాప్-అప్ కనిపిస్తుందో లేదో అప్పుడు చూడవచ్చు. అది కాకపోతే, మీ iPhone లేటెస్ట్ iOS వెర్షన్‌లో రన్ అవుతుందో లేదో నిర్ధారించుకోండి.

ఐఫోన్ 14 యూజర్లు ఎదుర్కొనే బగ్‌లలో ఇది మొదటి బగ్ కాదని తెలిపింది. iPhone 14 కెమెరాలు, డివైజ్ యాక్టివేట్ సమస్యలను ఎదుర్కొంది. Snapchat వంటి కొన్ని యాప్‌లు కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నాయి. అయితే ఆపిల్ డెడికేటెడ్ iOS 16 అప్‌డేట్‌లతో బగ్ సమస్యను పరిష్కరించింది.

Some iPhone 14 users facing SIM card issues, Apple says its investigating bug

Some iPhone 14 users facing SIM card issues, Apple says its investigating bug

నెక్స్ట్ iOS అప్‌డేట్ iPhone 14 సిరీస్‌లో ఈ కొత్త SIM కార్డ్‌లో బగ్ సమస్యను పరిష్కరించనుంది. ఓల్డ్ జనరేషన్ ఐఫోన్ 13 బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ MRP ధర రూ. 69,900 నుంచి రూ. 60వేల లోపు అందుబాటులో ఉండనుంది. కస్టమర్లు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో రూ. 5వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

పనితీరు పరంగా స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ లేదా తక్కువ ఒకే విధంగా ఉన్నాయి. అందులో iPhone 13 ఇప్పటికీ iPhone 14 కన్నా బెస్ట్ ఆప్షన్ పొందవచ్చు. డిజైన్ పరంగా.. రెండు డివైజ్‌లు ఒకేలా ఉంటాయి. మీరు iPhone సేల్ ఆఫర్ల కోసం తెలుసుకోవాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో విజిట్ చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhones Price : ఐఫోన్ లవర్స్‌కు షాకిచ్చిన ఆపిల్.. అత్యంత సరసమైన ఐఫోన్ 2022 మోడల్స్ ధరలు అమాంతం పెంచేసింది..!