Apple iPhone 14
Apple iPhone 14 : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్లలో ప్రతి మోడల్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఐఫోన్ లవర్స్ మార్కెట్లో తక్కువ ధరకు ఐఫోన్ సొంతం చేసుకోవాలని చూస్తుంటారు. కొన్ని ఏళ్ల క్రితం వరకు ఐఫోన్ కొనాలంటే ఆలోచించి మరి కొనేవారు.
ఎందుకంటే.. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ధర చాలా ఎక్కువ.. పైగా ఆపిల్ టాప్ బ్రాండ్ కూడా.. అన్ని డబ్బులు పోసి ఐఫోన్ కొనాలంటే మాటలా మరి.. అనేవారు.. రోజులు మారాయి.. ధరల్లో కూడా మార్పులు వచ్చాయి. అందని ద్రాక్షలా మారిన ఆపిల్ ఐఫోన్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ మాదిరిగా తక్కువ ధరకే లభ్యమవుతుంది.
ప్రతి కొత్త ఐఫోన్ లాంచ్‌తో గత ఐఫోన్ మోడళ్ల ధరలు ఒక్కసారిగా పడిపోతాయి. ఐఫోన్ 14 ధర కూడా అలానే పడిపోయింది. మీరు కూడా ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే సరైన అవకాశం. మీరు ఐఫోన్ 14 భారీ (256GB) స్టోరేజ్ వేరియంట్‌ను భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయొచ్చు.
ఆపిల్ ఐఫోన్ 14 టాప్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ రెండేళ్ల పాతది. అయినప్పటికీ అనేక ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కెమెరా క్వాలిటీ పరంగా చూస్తే ప్రతి కేటగిరీలోనూ ప్రత్యేకంగా ఉంటుంది.
మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఇప్పుడు ఈ అద్భుతమైన ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 16 సిరీస్ రాకతో ఆపిల్ అధికారిక సైట్‌లో ఐఫోన్ 14 నిలిపివేసింది. దాంతో ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 14 ధర ఇతర ఆండ్రాయిడ్ మోడళ్ల ధరకు పడిపోయింది.
ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ :
ప్రస్తుతం, 256జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 14 ధర అమెజాన్‌లో రూ.89,900కు లభ్యమవుతుంది. అయితే, ఈ ఐఫోన్ కొనుగోలుపై 32 శాతం భారీ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ఐఫోన్ ధర కేవలం రూ.60,900కే లభిస్తుంది. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు, అమెజాన్ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా అందిస్తోంది. మీరు రూ.1,827 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు.
రూ. 51వేలు సేవ్ చేయొచ్చు :
అంతేకాకుండా, మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడింగ్ ద్వారా మీరు రూ.22,800 వరకు విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. మీరు మొత్తం రూ.51వేలు ఆదా చేసుకోవచ్చు. మీరు ఫ్లాట్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ రెండింటినీ గరిష్టంగా పొందవచ్చు. తద్వారా ఐఫోన్ 14 మోడల్ 256జీబీ వేరియంట్‌ను రూ. 37,200 కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. మీ ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 14, ఐఫోన్ 16 మాదిరిగానే అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్‌తో వచ్చింది. వాటర్, డస్ట్ నిరోధకతకు ఐపీ68 రేటింగ్ కలిగి ఉంది. డాల్బీ విజన్‌కు సపోర్టుతో 6.1-అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
హుడ్ కింద ఆపిల్ A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. మీరు 6జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజీ ఆప్షన్లను పొందవచ్చు. ఫోటోగ్రఫీ ఔత్సాహికుల కోసం 12ఎంపీ లెన్స్‌లతో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 14 మోడల్ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 3279mAh బ్యాటరీని కలిగి ఉంది.