Gold Prices Today : బంగారం కొంటున్నారా? చేతిలో డబ్బులు లేవని క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొంటే మీ పని గోవిందా.. తప్పక తెలుసుకోండి!

Gold Prices Today : బంగారం కొంటున్నారా? నగదు కాకుండా క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొనాలని అనుకుంటున్నారా? కాస్తా ఆగండి.. ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి.

Gold Prices Today : బంగారం కొంటున్నారా? చేతిలో డబ్బులు లేవని క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొంటే మీ పని గోవిందా.. తప్పక తెలుసుకోండి!

Gold Prices Today

Updated On : March 6, 2025 / 11:37 AM IST

Gold Prices Today : బంగారం కొంటున్నారా? అసలే పెళ్లిళ్లు, పండగల సీజన్.. పెళ్లి పెట్టుకున్నవారంతా బంగారం కొనేందుకు చూస్తుంటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా లేదా ఇంటి మహాలక్ష్మి అమ్మాయి పుట్టిందని వారి కోసం బంగారం కొనేవారు ఉంటారు.

ప్రస్తుత రోజుల్లో బంగారం కొనాలి అనగానే ఎక్కువ మంది డబ్బులు ఇచ్చి కొనేస్తుంటారు. అయితే, బంగారం ఎలా కొనాలి అనే విషయంలో కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఆర్థికపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

చాలామందికి సమయానికి చేతిలో డబ్బు ఉండదు. బంగారం కొనే సమయంలో ఈ పరిస్థితి చాలామందికి ఎదురవుతుంది. అలాంటి సమయాల్లో తమ క్రెడిట్ కార్డు లేదా బంధువుల క్రెడిట్ కార్డు అడిగి తీసుకుని బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. కానీ, ఇక్కడ ఒక విషయం తప్పక తెలుసుకోవాలి.

Read Also : Gold Rates : బాబోయ్.. ఈ బంగారం ఇంతలా ఎందుకు పెరుగుతుంది? తగ్గినట్టే తగ్గి పెరగడానికి కారణం ఇదేనట.. ఎక్స్ పర్ట్స్ చెప్పింది వింటే..

బంగారాన్ని ఎప్పుడు కూడా డబ్బుతోనే కొంటేనే చాలా మంచిది. అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ఒక ఆప్షన్ మాత్రమే. కానీ, బంగారం కొనేటప్పుడు క్రెడిట్ కార్డుతో కొనే బెటర్ కదా అని అనుకుంటే తప్పులో కాలేసినట్టే.

ఎందుకంటే.. బంగారాన్ని క్రెడిట్ కార్డుతో అసలు కొనద్దు. అందులో మీకు లాభాలు కన్నా నష్టాలే ఎక్కువని గమనించాలి. ఒకవేళ కొనాల్సి వస్తే.. కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోవాలి. అసలు క్రెడిట్ కార్డుతో బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేయకూడదో వివరంగా చూద్దాం..

క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లపై ఆర్బీఐ నిబంధనలు :
పసిడిని డబ్బు లేదా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో ఎలాగైనా కొనుగోలు చేయొచ్చు. అయితే, బంగారం కొనే విషయంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలను చేర్చింది. 2013 ఏడాదిలో గోల్డ్ ఇంపోర్టులను నియంత్రించేందుకు ఆర్బీఐ క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొనుగోలు చేయడాన్ని నియంత్రించింది.

అందులో ప్రధానంగా క్రెడిట్ కార్డుతో బంగారం కొంటే మీకు ఈఎంఐ ఆప్షన్ ఉండదు. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోలు చేసినా ఆ మొత్తాన్ని బ్యాంకు ద్వారా ఈఎంఐలోకి మార్చడం కుదరదు. దీనికి సంబంధించి ఆర్బీఐ బ్యాంకులకు కూడా ఆదేశాలను ఇచ్చిందట. ఆభరణాల రూపంలో బంగారమే కాదు.. గోల్డ్ కాయిన్స్ కూడా కొనలేరని గమనించాలి. అంటే.. క్రెడిట్ కార్డులతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ కాయిన్స్ బిస్కెట్లను కూడా కొనడం సాధ్యపడదు.

క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొనుగోలు చేస్తే లాభాల కన్నా నష్టాలే ఎక్కువని చెప్పవచ్చు. చేతిలో సమయానికి ఎక్కువ డబ్బు లేకుంటే క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనుగోలు చేయొచ్చు. బంగారు షాపులతో చాలా బ్యాంకులు డీల్ కూడా కలిగి ఉంటాయి. ఆయా బ్యాంకుల క్రెడిట్ కార్డులతో బంగారం కొనుగోలు చేస్తే ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో పాటు రివార్డు పాయింట్లు పొందవచ్చు.

ఈఎంఐ ఆప్షన్ ఉండదు.. మొత్తం ఒకేసారి చెల్లించాలి :
ఉదాహరణకు మీరు ఒక తులం బంగారం రూ. 87వేలు పెట్టి కొన్నారని అనుకుందాం.. అప్పుడు మీ దగ్గర అన్ని డబ్బులు లేవని క్రెడిట్ కార్డు ద్వారా ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొన్నాక నిర్ణీత గడువు తేదీ అంటే.. 40 రోజుల నుంచి 50 రోజుల వ్యవధిలో మీరు ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

మీకు ఇక్కడ ఎలాగో ఈఎంఐ ఆప్షన్ లేదు. మీరు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి వస్తుంది. అంత డబ్బు ఒకేసారి సర్దుబాటు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ మీరు బిల్లు గడువు తేదీలోగా క్రెడిట్ కార్డు పేమెంట్ చేయకపోతే భారీ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

Read Also : Gold Rates Today : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొంటే ఈరోజే కొనేసుకోండి.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?

అది మీకు ఇంకా అదనపు భారంగా మారుతుంది. ప్రతి క్రెడిట్ కార్డుకు క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) ఒకటి ఉంది. మీరు సకాలంలో బిల్లు చెల్లించకపోతే దీనిపై ప్రభావం పడుతుంది. అందుకే, బంగారం కొనే ముందు మీరు తప్పనిసరిగా ఆలోచించుకోవాలి.

క్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోలు చేయాల్సి వస్తే.. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే అప్పులపాలు అవుతారు.. అప్పుడు కొన్న బంగారం అమ్మినా అంత డబ్బులు రావు.. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది..