Gold Rates Today : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొంటే ఈరోజే కొనేసుకోండి.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?
Gold Prices Today : బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంలో ఈరోజు తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold And Silver Price
Gold Rates Today : మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.. కొంటే ఈరోజే కొనేసుకోండి. మళ్లీ బంగారం ధరలు పెరిగినా పెరగొచ్చు. మీరు కూడా బంగారం కొనాలని అనుకుంటున్నారా? గత కొద్ది రోజులుగా బంగారం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో లక్ష దాటినా దాటొచ్చు..
ఒక్క భారత్ మార్కెట్లోనే కాదు.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలామంది పసిడి ధరల గురించి ఆరా తీస్తుంటారు. అయితే, బంగారం ధరలు ఇంకా దిగొచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశీయ ప్రధాన నగరాలతో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మార్చి 6, 2025 (ఈరోజు) ఉదయం 10 గంటల ప్రాంతంలో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.87,640కి తగ్గింది. అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,350 పైన ట్రేడవుతోంది.
ఈ రెండు క్యారెట్ల 10 గ్రాముల చొప్పున కేవలం రూ. 450 నుంచి 490 మధ్య ఈ రోజు పసిడి ధరలు తగ్గాయి. ఇక వెండి ధరలు కూడా తగ్గాయి. దేశంలో కిలో వెండి ధర రూ.97,900 వద్ద ట్రేడవుతోంది. దేశీయ ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలను ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? :
న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,640 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,350 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, చెన్నై నగరాల్లో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,490 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold Prices Today
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,200 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 97,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇతర నగరాల్లో చెన్నై, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.97,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా :
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,490 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,200 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,06,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈరోజు బంగారం ధరలు రూ. 400 నుంచి రూ. 440 మధ్య తగ్గాయి. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు ట్రేడ్ అవుతున్నాయి. అదే సమయంలో కిలో వెండి ధరలు కూడా రూ.1,06,900 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Note : బంగారం ధరలు అనేవి ప్రాంతాన్ని బట్టి సమయం ఆధారంగా తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో బంగారం ధరల ఆధారంగా ఇలా ఉన్నాయి..