Apple iPhone 15 Plus
iPhone 15 Plus : ఆపిల్ ఐఫోన్ కావాలా? క్రోమాలో ఐఫోన్ 15 ప్లస్ భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది. ఈ ఐఫోన్ అసలు ధర రూ.79,900 ఉండగా, రూ.11,410 తగ్గింపుతో పొందవచ్చు. 6.7-అంగుళాల ఆల్-స్క్రీన్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, పింక్, బ్లూ, బ్లాక్, ఎల్లో, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఆపిల్ A16 బయోనిక్ చిప్, 4,300mAh బ్యాటరీతో నడిచే ఐఫోన్ 15 ప్లస్ అన్ని ఐఫోన్ 15 సిరీస్ మోడళ్లలో అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. 20w USB టైప్-C ఛార్జింగ్, 15w వరకు మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది. అంతేకాకుండా, ఈ ఐఫోన్ IP68-రేటెడ్ స్ప్లాష్, డస్ట్ రెసిస్టెన్స్‌ను కూడా అందిస్తుంది. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
క్రోమాలో ఐఫోన్ 15 ప్లస్ ధర :
ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ రూ.71,490 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ ధర రూ.8,410 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.3వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
అర్హత కలిగిన క్రెడిట్ కార్డులపై తక్కువ ధర ఈఎంఐ లేదా నో-కాస్ట్ ఈఎంఐ కూడా పొందవచ్చు. ఈ డిస్కౌంట్ 128GB, 256GB మోడళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, క్రోమా స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను బట్టి రూ.60,766 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను కూడా అందిస్తోంది. కస్టమర్లు అదనపు ఛార్జీతో ఆపిల్ కేర్ ప్లస్ కూడా కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15 ప్లస్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ 2023లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మోడళ్లతో పాటు ఐఫోన్ 15 ప్లస్‌ను ప్రవేశపెట్టింది. ఈ హ్యాండ్‌సెట్ మొత్తం 4 మోడళ్లలో అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ అందిస్తుందని చెబుతున్నారు. 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో 12MP ఫ్రంట్ కెమెరా డైనమిక్ ఐలాండ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.
కెమెరా ఫ్రంట్ సైడ్‌లో ఐఫోన్ 15 ప్లస్ 48mp ప్రైమరీ కెమెరా, 12mp అల్ట్రా-వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్ 100 గంటల ఆడియో ప్లేబ్యాక్ టైమ్, 26 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుందని పేర్కొంది.