Apple iPhone 16 Pro : వావ్ వండర్‌‌ఫుల్.. ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

Apple iPhone 16 Pro : ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గింది. ఆపిల్ ప్రీమియం ఐఫోన్ ఇప్పుడు లాంచ్ ధర కన్నా రూ.16వేలు తక్కువకు వస్తుంది.

Apple iPhone 16 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ఐఫోన్ 16 ప్రో అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 లాంచ్ తర్వాత ప్రో మోడల్ ధర భారీగా తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్రో ధర ఇప్పుడు రూ. 13,400 వరకు తగ్గింది.

Read Also : Summer AC Offers : సమ్మర్ ఆగయా.. ఏసీలపై ఆఫర్లే ఆఫర్లు.. ఈ 4 ఏసీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. డబ్బులు, విద్యుత్ రెండూ ఆదా..!

అంటే.. దాదాపు ధర రూ. 1 లక్ష వరకు అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ ధర తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. అయితే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో లేదని గమనించాలి. విజయ్‌సేల్స్ మాత్రమే ఈ ఐఫోన్ 16ప్రోపై డిస్కౌంట్ అందిస్తోంది.

ఐఫోన్ 16 ప్రోపై డిస్కౌంట్ :
ఐఫోన్ 16 ప్రో లాంచ్ సమయంలో రూ.1,19,900 ధర ఉండగా, ఇప్పుడు కేవలం రూ.1,09,500కే అందుబాటులో ఉంది. విజయ్‌సేల్స్ సందర్భంగా ఐఫోన్ 16 సిరీస్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. మీరు ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేయడం ద్వారా రూ.10,400 తగ్గింపును అందిస్తోంది. అంతేకాదు.. రూ.3వేల విలువైన బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను మొత్తం రూ.13,400 డిస్కౌంట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.

ఐఫోన్ 16 ప్రో ఫీచర్లు :
ఫీచర్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్రో అద్భుతమైన 6.3-అంగుళాల సూపర్ రెటినా (XDR OLED) డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz ప్రో మోషన్ టెక్నాలజీ, డైనమిక్ ఐలాండ్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంది. A18 ప్రో బయోనిక్ చిప్‌సెట్ ద్వారా ఈ ఐఫోన్ మల్టీ టాస్కింగ్, ఫోటోగ్రఫీకి అద్భుతంగా ఉంటుంది. బ్యాటరీని ఒకసారి ఛార్జింగ్ చేస్తే రోజంతా ఎంజాయ్ చేయొచ్చు.

Read Also : Best Mobile Phones : కొత్త ఫోన్ కావాలా భయ్యా.. ఈ మార్చిలో రూ. 15వేల లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

కెమెరా విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ ఐఫోన్ 16 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP ఫ్యూజన్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 12MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అన్నీ 5x ఆప్టికల్ జూమ్‌కు సపోర్టు ఇస్తాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 12MP కెమెరాతో వస్తుంది. ఈ ఐఫోన్ iOS 18లో రన్ అవుతుంది. క్యాప్చర్ బటన్, ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.