Apple iPhone 16 Pro : కిర్రాక్ ఆఫర్ బ్రో.. భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో.. ఇలా కొన్నారంటే 20 నిమిషాల్లోనే డెలివరీ..!
Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ధర తగ్గింది. బిగ్ బాస్కెట్‌లో ఐఫోన్ ఆర్డర్ చేశారంటే కేవలం 20 నిమిషాల్లోనే మీ ఇంటికే డెలివరీ అవుతుంది.

Apple iPhone 16 Pro : ఆపిల్ కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఐఫోన్ 17 ప్రో గ్రాండ్ ఎంట్రీతో పాత మోడల్ ఐఫోన్ 16 ప్రో భారీగా తగ్గింది. రూ. లక్ష లోపు ధరకే ఫ్లాగ్‌షిప్ ఆపిల్ ఐఫోన్ కొనేసుకోవచ్చు. ప్రస్తుతం బిగ్ బాస్కెట్ లిమిటెడ్ టైమ్ డీల్‌ను అందిస్తోంది.

ఈ డీల్ ద్వారా ఐఫోన్ 16 ప్రో ధర రూ. 19వేలు కన్నా ఎక్కువ తగ్గింపు పొందింది. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో అత్యుత్తమ విలువ కలిగిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. బిగ్ బాస్కెట్‌లో ఐఫోన్ 16 ప్రో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బిగ్ బాస్కెట్‌లో ఐఫోన్ 16 ప్రో డీల్ : ఐఫోన్ 16 ప్రో ధర లాంచ్ సమయంలో భారత మార్కెట్లో రూ.1,19,900గా ఉంది. అయితే, ఇప్పుడు ఐఫోన్ 16 ప్రో ధర రూ.99,990కి తగ్గింది. కొనుగోలుదారులు నేరుగా రూ.19,910 తగ్గింపు పొందవచ్చు. ఆసక్తిగల వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ధర మరింత తగ్గుతుంది. బిగ్ బాస్కెట్ 20 నిమిషాల్లో ఐఫోన్ 16 ప్రో డెలివరీ చేస్తుంది. అతి తక్కువ సమయంలోనే మీ ఇంటి వద్దే కొత్త ఐఫోన్ 16 ప్రోని పొందవచ్చు.

ఐఫోన్ 16 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : సెప్టెంబర్ 2024లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్రో, టైటానియం ఫ్రేమ్, గ్లాస్ ఫ్రంట్, బ్యాక్, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 2000 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.3-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది.

3nm ప్రాసెస్‌పై ఆపిల్ A18 ప్రో చిప్ కలిగి ఉంది. 1TB వరకు స్టోరేజీ, 8GB ర్యామ్‌తో వస్తుంది. 48MP వైడ్ లెన్స్, 12MP అల్ట్రావైడ్ కెమెరా, LiDAR స్కానర్ అన్నీ ఐఫోన్ 16 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తాయి. అంతేకాకుండా, 3D స్పేషియల్ వీడియో రికార్డింగ్, 4K డాల్బీ విజన్ HDRకి సపోర్టు ఇస్తుంది.

సెల్ఫీలు, ఫేస్ ఐడీ కోసం డాల్బీ విజన్ హెచ్‌డీఆర్, OISకి సపోర్టు ఇచ్చే 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 7, బ్లూటూత్ 5.3, USB టైప్-C (జనరల్ 3.2), UWB జనరల్ 2 సపోర్ట్ ఉన్నాయి. ఈ ఐఫోన్ 16 ప్రో ఫోన్ 3582mAh బ్యాటరీతో వస్తుంది. మ్యాగ్‌సేఫ్ Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.