Apple iPhone 16 Pro : సూపర్ ఆఫర్.. లక్ష ఖరీదైన ఆపిల్ ఐఫోన్ 16ప్రో భారీగా తగ్గిందోచ్.. జస్ట్ ఎంతంటే? ఇప్పుడే కొనేసుకోండి!

Apple iPhone 16 Pro : ఆపిల్ కొత్త ఐఫోన్ కొంటున్నారా? భారీ తగ్గింపుతో ఐఫోన్ 16 ప్రో లభ్యమవుతోంది. బ్యాంకు ఆఫర్లతో ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16 Pro

Apple iPhone 16 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 16 ప్రో ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌ల తర్వాత విజయ్ సేల్స్‌లో భారీ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉంది. మీరు ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.

ఎందుకంటే.. మీరు ఈ ఐఫోన్ 16ప్రోపై రూ.14,900 ఆదా చేయవచ్చు. అంటే.. రూ.1,19,900 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ ఐఫోన్ 16ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రోమోషన్‌తో కూడిన భారీ సూపర్ రెటినా డిస్‌ప్లే, టైటానియం ఫ్రేమ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, టైప్-C పోర్ట్‌తో డైనమిక్ ఐలాండ్‌ను అందిస్తుంది. మీరు విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 Pro డీల్ అతి తక్కువ ధరకు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Fipkart Bikes Sale : బంపర్ ఆఫర్ భయ్యా.. ఫ్లిప్‌కార్ట్‌‌లో ఫోన్లే కాదు.. కొత్త బైకులు కూడా కొనొచ్చు.. కేటీఎం, ట్రయంఫ్ ఏది కావాలి?

భారత్‌లో ఐఫోన్ 16 ప్రో ధర, ఆఫర్లు :
ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 16 ప్రో రూ.1,09,500కు అందుబాటులో ఉంది. అంటే.. రూ.10,400 తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా, HDFC, SBI, ICICI లేదా ఇతర కార్డులతో సహా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై కస్టమర్లు రూ.4,500 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. ఇంకా, కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

మోడల్, డివైజ్ వర్కింగ్ కండిషన్ బట్టి ఐఫోన్ కొనుగోలుపై సాధ్యమైనంత బెస్ట్ ట్రేడింగ్ వాల్యూను పొందవచ్చు. అదనంగా, కొనుగోలుదారులు EMI ఆప్షన్లతో నెలకు రూ. 5,309 నుంచి 24 నెలల పాటు ఎంచుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ. 821 విలువైన 821 పాయింట్లను కూడా అందిస్తుంది. ఈ రివార్డు పాయింట్లను వారి కొనుగోలుపై క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేకు సపోర్టు ఇస్తుంది. రెండో జనరేషన్ 3nm ఫ్యాబ్రికేషన్‌పై రూపొందిన A18 ప్రో చిప్ ద్వారా పవర్ పొందుతుంది. ఇందులో 6-కోర్ CPU, 6-కోర్ GPU, ఏఐ టాస్కుల కోసం 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి.

గేమింగ్ గ్రాఫిక్స్ కోసం ఆపిల్ ఇంటిగ్రేట్ హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్‌ను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్లలో 20శాతం ఎక్కువ బ్యాటరీ లైఫ్ కలిగి ఉందని పేర్కొంది. ఈ ఐఫోన్ అన్ని ఏఐ ఫీచర్లతో లేటెస్ట్ iOS 18.4పై రన్ అవుతుంది.

Read Also : Share Market Fall Today : భారత స్టాక్ మార్కెట్ ఢమాల్.. భారీగా క్షీణించిన సెన్సెక్స్.. ఒక్కరోజే రూ.3.4 లక్షల కోట్లు ఆవిరి.. ట్రంప్ సుంకాల భయమే కారణమా?

కెమెరా సెటప్‌లో క్వాడ్-పిక్సెల్ డిజైన్‌తో కూడిన 48MP మెయిన్ సెన్సార్, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 4K 120 FPS డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్‌తో కూడిన 12MP 5x టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అదనంగా, ఈ ఐఫోన్ కెమెరా కంట్రోల్ బటన్ కీలక కెమెరా ఫంక్షన్లకు వేగంగా యాక్సస్ అందిస్తుంది. ఇంపార్టెంట్ నోటిఫికేషన్‌లు, ఏఐ సమ్మరీ, స్మార్ట్ సిరి, ఇమేజ్ ప్లేగ్రౌండ్, విజువల్ ఇంటెలిజెన్స్ మరిన్నింటితో సహా ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కూడా అందిస్తుంది.