స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. ఒక్క రోజే రూ.340000000000 సంపద ఆవిరి.. దీనికి కారణాలు తెలిస్తే..
Share Market Fall Today : బెంచ్‌మార్క్ సూచీలు 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి ట్రేడింగ్ సెషన్‌లో భారీ క్షీణతను నమోదు చేశాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు దాదాపు రూ.3.4 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.

Why Did The Share Market Fall Today
Share Market Fall Today : భారత స్టాక్ మార్కెట్ ఒక్కసారి కుప్పకూలింది. ఏప్రిల్ 1న (ఈరోజు) 2026 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో భారీ క్షీణత నమోదైంది. సెన్సెక్స్ దాదాపు 1391 పాయింట్లు నష్టపోయింది. అదే సమయంలో, నిఫ్టీ 23,200 దిగువకు పడిపోయింది. రెండు సూచీలు క్షీణతతో ముగియడం ఇది వరుసగా రెండో రోజు. దీని కారణంగా, ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు దాదాపు రూ.3.4 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌ను ట్రంప్ సుంకాల భయం వెంటాడుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Read Also : iPhone 16 : బిగ్ డిస్కౌంట్.. రూ.80వేల ఐఫోన్ 16 కేవలం రూ.44వేలకే.. ఇంత తక్కువలో మళ్లీ దొరకదు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న కొత్త పరస్పర సుంకాన్ని ప్రకటించబోతున్నారు. ఈ కారణంగా, పెట్టుబడిదారులు జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా అమ్మకాలు కనిపిస్తున్నాయి. మీడియా, టెలికాం మినహా మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, రియల్టీ స్టాక్స్‌లో అతిపెద్ద క్షీణత కనిపించింది.
BSE మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా ఒక శాతానికి పైగా పడిపోయింది. అయితే, స్మాల్‌క్యాప్ స్టాక్‌లు కొద్దిగా పుంజుకున్నాయి. BSE స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం లాభంతో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,390.41 పాయింట్లు లేదా 1.80 శాతం తగ్గి 76,024.51 వద్ద ముగిసింది. మరోవైపు, NSE 50 షేర్ల ఇండెక్స్ నిఫ్టీ 353.65 పాయింట్లు లేదా 1.50 శాతం తగ్గి 23,165.70 వద్ద ముగిసింది.
BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3 లక్షల కోట్లకు పైగా కోల్పోయింది. BSEలోని టాప్ 30 స్టాక్‌లలో 29 స్టాక్‌లు పడిపోయాయి. ఇందుఇంద్ బ్యాంక్ స్టాక్ మాత్రమే లాభాల్లో కనిపిస్తోంది. HDFC బ్యాంక్ షేర్ 3 శాతానికి పైగా పడిపోయింది. అదేవిధంగా, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు కూడా దాదాపు 3 శాతం మేర తగ్గాయి. ఆటో మినహా అన్ని ప్రధాన రంగాలు నష్టాల్లో చవిచూశాయి. నిఫ్టీ ఐటీ, రియాల్టీ, ఫైనాన్షియల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1 శాతం నుంచి 3శాతానికి తగ్గాయి. BSE జాబితాలో అన్ని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.25 లక్షల కోట్లు తగ్గి రూ.411.62 లక్షల కోట్లకు చేరుకుంది.
రూ.3.39 లక్షల కోట్ల నష్టం :
బీఎస్‌ఈలో జాబితా అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏప్రిల్ 1న రూ.409.48 లక్షల కోట్లకు తగ్గింది. అంతకుముందు ట్రేడింగ్‌లో మార్చి 28న రూ.412.87 లక్షల కోట్లుగా ఉంది. ఈ విధంగా, బీఎస్‌ఇలో జాబితా అయిన కంపెనీల మార్కెట్ క్యాప్ ఈరోజు దాదాపు రూ.3.39 లక్షల కోట్లు తగ్గింది. మరో మాటలో చెప్పాలంటే, పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ.3.39 లక్షల కోట్లు తగ్గింది అనమాట.
షేర్ మార్కెట్ ఎందుకు అంతగా క్షీణించిందంటే? :
ట్రంప్ పరస్పర సుంకం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు (ఏప్రిల్ 2వ) తేదీన ప్రపంచంలోని అనేక దేశాలపై పరస్పర సుంకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రతీకార సుంకాన్ని విధించనున్నారు. దీని కారణంగా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భయాందోళనకు గురవుతున్నాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనం :
ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే.. భారత రూపాయి విలువ 32 పైసలు తగ్గి 85.47కి చేరుకుంది. డాలర్ ఇండెక్స్ 0.14 శాతం తగ్గి 104.04కి చేరుకుంది. అమెరికా సుంకాల విధానాలపై మరింత స్పష్టత కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. అయితే, షేర్ మార్కెట్లు అస్థిరంగానే ఉన్నాయి.
ముడి చమురు ధరల పెరుగుదల :
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరుగుదల కూడా భారత స్టాక్ మార్కెట్‌కు ప్రతికూలంగా మారాయి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 1.51 శాతం పెరిగి 74.74 డాలర్లకు చేరుకుంది. భారత దిగుమతిపై ఆందోళనలను రేకెత్తించింది. అదే సమయంలో, ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలుదారులను కూడా హెచ్చరించారు.
ఆర్థిక మాంద్యం ముప్పు :
బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ అమెరికాలో మాంద్యం సంభావ్యతను 35 శాతానికి పెంచింది. ముందుగా బ్రోకరేజ్ 20 శాతం మాంద్యం వచ్చే అవకాశాన్ని అంచనా వేసింది. ఇది కూడా షేర్ మార్కెట్లో క్షీణతకు దారితీసింది. అందులోనూ పెట్టుబడిదారులు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ షేర్లు అత్యధికంగా పడిపోయాయి. రెడింగ్టన్ షేర్లు 5.58 శాతం, న్యూలాండ్ ల్యాబ్స్ 5.13శాతం, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 4.56 శాతం తగ్గాయి. వోల్టాస్ షేర్లు 6.75 శాతం, పాలసీ బజార్ 4.82 శాతం, ఇన్ఫో ఎడ్జ్ షేర్లు 5.25 శాతం, బజాజ్ హోల్డింగ్ షేర్లు 4.71 శాతం తగ్గాయి.
ట్రంప్ భారత్‌పై సుంకాలు విధిస్తారా? :
ఏప్రిల్ 2 గడువుకు ముందే అమెరికన్ వస్తువులపై సుంకాలను గణనీయంగా తగ్గించడానికి భారత్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికన్ వాణిజ్యానికి ‘విముక్తి దినం’గా ఆయన అభివర్ణించారు. భారత్ సహా ఇతర దేశాల నుంచి దిగుమతులపై పరస్పర సుంకాలను విధించడానికి ట్రంప్ సిద్ధమవుతున్న సమయంలో స్టాక్ మార్కెట్లు భారీగా క్షీణించాయి.
యూరోపియన్ యూనియన్ ఇప్పటికే తన సుంకాన్ని 2.5శాతానికి తగ్గించిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. భారత్ కూడా తన సుంకాలను గణనీయంగా తగ్గించుకోబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, భారత అధికారుల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. భారత్ సుంకాలను తగ్గిస్తే.. అమెరికా కూడా సుంకాలను తగ్గిస్తుందని ట్రంప్ అన్నారు.
ఏప్రిల్ 2న ఏం జరుగనుంది? :
ట్రంప్ సుంకం విధించక ముందే భారత స్టార్ మార్కెట్ భారీ క్షీణతకు గురైంది. బుధవారం, ఏప్రిల్ 2న సుంకం అమల్లోకి వస్తే.. స్టాక్ మార్కెట్ మరింత క్షీణతను చూడవచ్చు. కానీ, అమెరికా భారత్ సుంకాల విషయంలో రిలీఫ్ చేస్తే.. దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు మరింత పుంజుకోవచ్చు.